జమిలి ఎన్నికలు అసాధ్యమంటున్న సీఎం

First Published Jul 9, 2018, 1:52 PM IST
Highlights

2019లో కాదు కదా.. 2024లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2019లో కాదు కదా.. 2024లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సైద్ధాంతికంగా జమిలి ఎన్నికలకు అనుకూలమని, కానీ ప్రస్తుతం ఆ ఎన్నికల నిర్వహణకు అలాంటి పరిస్థితులు ఏమీలేవని సీఎం నితీశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.

కాగా.. ఈ అభిప్రాయం పట్ల పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు సంఘీభావం తెలుపగా..మరికొందరు వ్యతిరకతను వ్యక్తం చేశారు.  అయితే ఈ అంశంపై న్యాయ కమీషన్ ముందు ఆదివారం కొన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. జమిలి ఎన్నికల నిర్వహణకు అనేక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఆ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తే బాగుంటుందని సీఎం నితీశ్ అభిప్రాయపడ్డారు. బీహార్‌లో మాత్రం జేడీయూ, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఏమీ చెప్పలేమన్నారు. 
 

click me!