సివిల్స్‌లో టాపర్స్... ట్రైనింగ్‌లో 119 మంది ఐపీఎస్‌లు ఫెయిల్

First Published Jul 9, 2018, 12:34 PM IST
Highlights

సివిల్స్‌లో టాపర్స్ అంటే వాళ్ల సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. దేశంలోనే అత్యున్నత  పరీక్షలు రాసిన వారు ట్రైనింగ్‌లో తప్పితే.. వినడానికే ఆశ్చర్యకరంగా ఉంది కదూ. శిక్షణా కాలం ముగిసే సమయంలో పరీక్ష నిర్వహించగా 119 మంది అధికారులు ఫెయిల్ అయ్యారు

సివిల్స్‌లో టాపర్స్ అంటే వాళ్ల సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. దేశంలోనే అత్యున్నత  పరీక్షలు రాసిన వారు ట్రైనింగ్‌లో తప్పితే.. వినడానికే ఆశ్చర్యకరంగా ఉంది కదూ.. 2016 సివిల్స్‌లో ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ నిమిత్తం వచ్చారు. వీరికి 45 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది.

శిక్షణా కాలం ముగిసే సమయంలో పరీక్ష నిర్వహించగా 119 మంది అధికారులు ఫెయిల్ అయ్యారు. ఇది అకాడమీ చరిత్రలోనే తొలిసారి.. మొత్తం 136 మంది అధికారులు పరీక్షలు రాయగా.. వీరిలో 14 మంది ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన వారు... మిగిలిన 122 మంది ఐపీఎస్‌లే.. వీరిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినవారు 119 మంది ఉన్నారు. అంటే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం ముగ్గురే.

ప్రధానంగా ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లలో వీరు  ఫెయిల్ అయినట్లు ఒక జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. పాసింగ్ ఔట్‌లో మెడల్స్, ట్రోఫీలు అందుకున్న వారు కూడా ఫెయిల్ అయిన లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీరు అన్ని సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించడానికి మరో  రెండు అవకాశాలు ఇస్తారు.. మూడు సార్లు పాస్ అవ్వని పక్షంలో సర్వీసులో కొనసాగించరు.
 

click me!