మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు: చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ

First Published Aug 7, 2018, 10:56 PM IST
Highlights

మాజీ తమిళనాడు సీఎం కరుణానిధి అంత్యక్రియలను నిర్వహించే విషయమై మద్రాసు హైకోర్టులో డీఎంకె నేతల పిటిషన్ పై మంగళవారం అర్థరాత్రి విచారణ ప్రారంభమైంది. ఇద్దరు జడ్జిలు డీఎంకె పిటిషన్ పై విచారణ సాగిస్తున్నారు.
 


చెన్నె: మాజీ తమిళనాడు సీఎం కరుణానిధి అంత్యక్రియలను నిర్వహించే విషయమై మద్రాసు హైకోర్టులో డీఎంకె నేతల పిటిషన్ పై మంగళవారం అర్థరాత్రి విచారణ ప్రారంభమైంది. ఇద్దరు జడ్జిలు డీఎంకె పిటిషన్ పై విచారణ సాగిస్తున్నారు.

మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించడానికి తమిళనాడు ప్రభుత్వం ససేమిరా అంటుంది. గాంధీ మండపం వద్ద రెండు ఎకరాలను స్థలాన్ని కేటాయించింది. అయితే మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలను నిర్వహిస్తామని డీఎంకె ప్రకటించింది.

ఈ విషయమై డీఎంకె నేతలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెరీనా బీచ్ లోనే  కరుణానిధి అంత్యక్రియలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్., నేషనల్ కాన్పరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

డీఎంకె నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ తో పాటు మరో జడ్జి విచారణ జరుపుతున్నారు. తన గురువైన అన్నాదురై సమాధి వద్దే కరుణానిధి అంత్యక్రియలను నిర్వహించాలని కరుణానిధి కుటుంబసభ్యులు కోరుకొంటున్నారు.ఈ డిమాండ్ కు ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తున్నారు. మరోవైపు డీఎంకె నేత స్టాలిన్ ఈ విషయంలో పలు  రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నాడు. 

మెరీనాబీచ్ లో కరుణానిధి అంత్యక్రియల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ విన్పించారు. తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయనారాయణ అందుబాటులోని లేరు. దీంతో విజయనారాయణకు బదులుగా వైద్యనాథన్ ప్రభుత్వం తరుపున వాదనలను విన్పించారు.


 

click me!