విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన,12 ప్రత్యేక ఛానెల్స్: నిర్మలా సీతారామన్

By narsimha lode  |  First Published May 17, 2020, 12:03 PM IST

విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యా బోధనకు గాను ప్రత్యేకంగా చానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. స్వయం ప్రభ డీటీహెచ్ చానెల్ తో పాటు మరో 12 చానెల్స్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 


న్యూఢిల్లీ: విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యా బోధనకు గాను ప్రత్యేకంగా చానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. స్వయం ప్రభ డీటీహెచ్ చానెల్ తో పాటు మరో 12 చానెల్స్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

ఆదివారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మరో 12 చానెల్స్ ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు ఈ చానెల్స్ ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని చెప్పారు.

Latest Videos

undefined

1-12 తరగతుల వరకు ఈ విద్య కోసం ప్రత్యేకంగా ఒక్కో ఛానల్ ఏర్పాటు చేస్తామన్నారు. బధిరుల కోసం ప్రత్యేకంగా ఈ క్లాస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.ఆన్ లైన్ కోర్సుల అమలుకు 100 వర్శిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు.

మనో దర్పణ్ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టుగా ఆమె చెప్పారు. స్వయంప్రభ డీటీహెచ్ చానల్ ద్వారా ప్రతి రోజూ 4 గంటల పాటు విద్యార్థులకు పాఠాలు బోధించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఈ స్కూల్ లో 200 కొత్త పుస్తకాలు అందుబాటులలోకి వస్తాయన్నారు. టాటా స్కై, ఎయిర్ టెల్ డీటీహెచ్ ల ద్వారా ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలను బోధించనున్నట్టుగా తెలిపారు.

కరోనా నేపథ్యంలో ఆరోగ్య నిపుణుల రక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వైద్యులు, నర్సులతో పాటు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల భీమా రక్షణ కల్పించినట్టుగా చెప్పారు. 

also read:సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొంటాం: నిర్మలా సీతారామన్

ఇందు కోసం రూ. 15 వేల కోట్లు విడుదల చేశామన్నారు. టెలి మెడిసిన్ అమల్లోకి వస్తోందన్నారు.అంటువ్యాధుల చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు

. రాష్ట్రాల్లో ఆరోగ్య సేవల కోసం రూ. 4,100 కోట్లు మంజూరు చేసినట్టుగా మంత్రి వివరించారు. ప్రతి రాష్ట్రంలోని బ్లాక్ స్థాయిల్లో ప్రజారోగ్యం కోసం ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించుకోవడానికి కంపెనీలకు అనుమతిస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు. స్కూళ్ల డిజిటలైలేషన్ కు అనుమతిచ్చామన్నారు. స్వయం ప్రభ ఛానెల్ ద్వారా ఇప్పటికే విద్యార్థుల కోసం కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఉపాధి హామీ పనులకు ఈ ఏడాదికి రూ. 61వేల కోట్లు కేటాయించామన్నారు. అయితే దీనికి అదనంగా మరో 40 వేల కోట్లను కేటాయించినట్టుగా చెప్పారు.

click me!