అలా జరిగితే.. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధమే: నిర్మలా సీతారామన్

Published : Feb 16, 2023, 02:29 AM IST
అలా జరిగితే.. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధమే: నిర్మలా సీతారామన్

సారాంశం

పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ: పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాల సమ్మతి అవసరమని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోగలమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ: పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకరావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.  ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని తెలిపారు. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (PHDCCI) సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని ప్రకటించారు. 

ఈ విషయంలో జీఎస్టీ మండలిలో చర్చకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని అన్నారు. కానీ.. వృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు పెంచిందని మంత్రి తెలిపారు. 

గత మూడు-నాలుగేళ్లుగా నిరంతరం ప్రజా మూలధన వ్యయంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వాటిపై దృష్టి పెట్టామని అన్నారు. విద్యుత్ సహా వివిధ రంగాలలో సంస్కరణలు తీసుకురావాలనీ, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని తాము రాష్ట్రాలను  ప్రోత్సహిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు చాలా కాలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాచేస్తే వాటి ధరలు తగ్గుతాయని కూడా అంటున్నారు. GST కౌన్సిల్  49వ సమావేశం ఫిబ్రవరి 18, 2023న న్యూఢిల్లీలో జరగనుంది .

దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోల్-డీజిల్, ఇతర ఇంధనాలపై పన్నును తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.  రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం మొక్కజొన్న, ఇంధనంపై పన్ను రేట్లను తగ్గించవచ్చని రాయిటర్స్‌ను ఉటంకిస్తూ ET నివేదించింది.

పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గింపుపై ప్రభుత్వం మార్చిలో నిర్ణయం తీసుకుంటుందని దీనికి సంబంధించి సమాచారం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఫిబ్రవరికి సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా వస్తాయి.

  జనవరి 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం  5.72 శాతంగా ఉంది. ఇదొక్కటే కాదు ద్రవ్యోల్బణం ప్రభావం ఆహార పదార్థాల ధరలపై కూడా ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాలు, మొక్కజొన్న , సోయాబీన్ నూనె ధరలు గణనీయంగా పెరిగాయి. మొక్కజొన్న వంటి వస్తువులపై ప్రభుత్వం పన్ను రేటును తగ్గిస్తోంది, ఇంధనంపై పన్ను మళ్లీ తగ్గించవచ్చని పలు నివేదికలు భావిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !