ఈశాన్య రాష్ట్రాల నుంచి కాశ్మీర్ కు పర్యాటకుల తాకిడి.. మరింతగా మెరిసిపోతున్న భూతల స్వర్గం !

Published : Jul 21, 2023, 10:35 AM ISTUpdated : Jul 21, 2023, 10:37 AM IST
ఈశాన్య రాష్ట్రాల నుంచి కాశ్మీర్ కు పర్యాటకుల తాకిడి.. మరింతగా మెరిసిపోతున్న భూతల స్వర్గం !

సారాంశం

Kashmir Tourism: జూన్ నాటికి దాదాపు 50 లక్షల మంది పర్యాటకులు జ‌మ్ముకాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించడం ఇక్క‌డి ప‌ర్యాట‌క‌ సానుకూల ధోరణిని సూచిస్తుంది. అమర్ నాథ్ యాత్రికులకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల గురించి తెలియజేయడానికి డిజిటల్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఇది సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కాశ్మీర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇప్పుడు భూతల స్వర్గం మరింతగా మెరిసిపోతోంది.

Paradise on Earth Tourism: కాశ్మీర్ అందాల గురించి ఎంత వ‌ర్ణించిన త‌క్కువే. అయితే, 'భూమిపై స్వర్గం' గా దీనికి గుర్తింపు ఉంది. జూన్ నాటికి దాదాపు 50 లక్షల మంది పర్యాటకులు జ‌మ్ముకాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించడం ఇక్క‌డి ప‌ర్యాట‌క‌ సానుకూల ధోరణిని సూచిస్తుంది. అమర్ నాథ్ యాత్రికులకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల గురించి తెలియజేయడానికి డిజిటల్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఇది సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కాశ్మీర్ కు పర్యాటకుల తాకిడి పెర‌గింది. ఇప్పుడు మరింతగా భూతల స్వర్గం మెరిసిపోతోంది.

కాశ్మీర్ లోయలో శాంతి నెలకొనడంతో ఈశాన్య ప్రాంత పర్యాటకులు మరోసారి భూతల స్వర్గానికి పోటెత్తుతున్నారు. పర్యాటక శాఖలు, ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు అందించిన గణాంకాల ఆధారంగా సాంప్రదాయిక అంచనా ప్రకారం..అస్సాం  స‌హా ఈశాన్య ఇతర ప్రాంతాల నుండి దాదాపు 25,000 మంది పర్యాటకులు 2022లో కాశ్మీర్‌ను సందర్శించారు. 2023 చివరి ఆరు నెలల్లో ఈశాన్య భార‌తం నుంచి పర్యాటకుల సంఖ్య దాదాపు 12,000 ఉంది. ప్ర‌స్తుతం వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2023లో 30,000 మందికి పైగా పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శిస్తారని టూర్ ఆపరేటర్లు తెలిపారు.

"చిన్నప్పటి నుంచి కాశ్మీర్ ను సందర్శించాలని కలలు కనేదాన్ని. 'భూత‌ల స్వర్గం' చూడాలని ఆరాటపడ్డాను. కానీ ఇటీవలి సంవత్సరాల్లో తిరుగుబాటు కారణంగా కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు లోయను సందర్శించే నా ప్రణాళికను నిలిపివేయవలసి వచ్చింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో వేగంగా పుంజుకుంటున్న శాంతి ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో నా కుటుంబంతో కలిసి కాశ్మీర్ కు వచ్చేలా చేసింది. నా కల సాకారమైంది. నేను కాశ్మీర్ లోని చాలా పర్యాటక ప్రదేశాలను సందర్శించాను" అని గౌహతికి చెందిన వ్యాపారవేత్త గీతార్త తాలుక్దార్ చెప్పారు.

2022లో మొత్తం 1.88 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సంద‌ర్శించారు. గ‌తంలో పోలిస్తే ఈ సంఖ్య‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని చెప్పాలి. అయితే ఈ ఏడాది రెండు కోట్ల మార్కును దాటుతుందని అధికార యంత్రాంగం ధీమాగా ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జ‌మ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్న గౌహతికి చెందిన ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్ బినోయ్ దాస్ లోయకు చేరుకున్న తర్వాత ప్రపంచం నుంచి బయటకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. మంగళవారం (జూలై 18) బినోయ్ తన కుటుంబంతో కలిసి దేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. "జ‌మ్మూకాశ్మీర్ లోని దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. లోయ ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉందనీ, పర్యాటకులు భద్రతా భావంతో ప్రదేశాలను సందర్శిస్తున్నారని" బినోయ్ దాస్ తెలిపారు.

తూర్పు అస్సాంలోని శివసాగర్‌కు చెందిన షాహీన్ అక్తర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కాశ్మీర్‌ను త‌ప్ప‌కుండా సందర్శిస్తున్నారు. 'కాశ్మీర్ లో ఇది నా మూడో పర్యటన. నా మొదటి సందర్శన 2004లో, ఆ తర్వాత 2013లో జరిగింది. ఈసారి నేను నా కుటుంబంతో క‌లిసి ఇక్కడ ఉన్నాను. కాశ్మీర్ ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది. మీరు ఈ అందమైన లోయను విడిచిపెట్టిన ప్రతిసారీ మీరు మళ్ళీ రావాలని కోరుకుంటారు. సర్వశక్తిమంతుడు కాశ్మీర్ ద్వారా ఈ భూమిపై స్వర్గాన్ని సృష్టించాడు" అని షహీన్ అన్నారు.

- ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో.. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !