రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడో తెలుసా

By Nagaraju TFirst Published Sep 24, 2018, 8:39 PM IST
Highlights

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సన్సేషన్. అది సినీ రంగంలోనైనా...బయట అయినా. తలైవా రాజకీయాల్లోకి వస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీ సైతం రజనీకాంత్ ఇంటికి వెళ్లి స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించారు.


చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సన్సేషన్. అది సినీ రంగంలోనైనా...బయట అయినా. తలైవా రాజకీయాల్లోకి వస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీ సైతం రజనీకాంత్ ఇంటికి వెళ్లి స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయినా రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు రజనీకాంత్. అయితే తలైవా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని అభిమానులు మాత్రం ఆతృతగా ఎదురు చూశారు.  

చివరకు తన మనసులో మాట బయటపెట్టారు రజనీ. రాజకీయారంగేట్రంపై ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన రజనీ తొందర్లోనే రాజకీయాల్లోకి వస్తానంటూ అభిమానులకు తీపి కబురు చెప్పారు. అయితే కొత్త పార్టీ ప్రకటించే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రజనీకాంత్ ఎప్పుడు పార్టీ పెడతారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 
ఇదిలా ఉంటే రజనీ కాంత్ కొత్త పార్టీ ప్రకటన డిసెంబర్ లో ఉంటుందని ఆయన సన్నిహితుడు పుదియ నీతి కట్చి నేత ఏసీ షణ్ముగం తెలిపారు. అంతేకాదు రజనీకాంత్ పార్టీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని కూడా వెల్లడించేశారు. అన్నాడీఎంకే పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న షణ్ముగం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో పుదియ నీతి కట్చి పార్టీని స్థాపించారు.

click me!