తుంగభద్రకు భారీగా వరద: 33 గేట్లు ఎత్తివేత

By narsimha lodeFirst Published Aug 17, 2018, 5:51 PM IST
Highlights

తుంగభద్ర జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  తుంగభద్ర ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. దీంతో 33 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

బళ్లారి:తుంగభద్ర జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  తుంగభద్ర ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. దీంతో 33 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సుమారు 10 ఏళ్లుగా  ఎప్పుడూ లేనంతగా 2.10 లక్షల క్యూసెక్కుల నీరు తుంగభద్ర జలాశయంలోకి వచ్చి చేరుతోంది. భారీగా వస్తున్న వరదలతో జలాశయానికి ప్రమాదం లేకుండా ఎగువ నుండి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర నుండి విడుదల చేస్తున్న నీరు  శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 3 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు అదికారులు ప్రకటించారు.

శ్రీశైలం ప్రాజెక్టు కూడ భారీగా నీరు వచ్చే చేరే  అవకాశం ఉందని అదికారులు అభిప్రాయపడుతున్నారు. హెచ్‌ఎల్‌సీ , ఎల్లెల్సీ , కర్ణాటక కాలువల ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు నిరంతరాయంగా  విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దశాబ్దంన్నర తర్వాత తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్లను తెరిచారు. 

click me!