ఒకే క్లాస్ లో తండ్రి, కొడుకులు.. ఇబ్బందిపడ్డ వాజ్ పేయి

By ramya neerukondaFirst Published Aug 17, 2018, 4:57 PM IST
Highlights

తను చదివిన కళాశాల మ్యాగ్జిన్ లో ఓ కవర్ స్టోరీ రాశారు. అందులో తండ్రి కొడుకులు ఒకే కాలేజీలో.. అందులోనూ ఒకే క్లాస్ లో చదువుకోవడం మీరు ఎక్కడా చూసి ఉండరు అంటూ వాజ్ పేయి పేర్కొన్నారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కన్నుమూసిన తర్వాత.. ఆయన గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాజ్ పేయి తన తండ్రితో కలిసి ఒకే తరగతిలో లా విద్యను చదివారు.  1945లో వాజ్ పేయి కన్పూర్ కాలేజీలో లా విద్యను అభ్యసించారు. అప్పటికే టీచర్ గా 30 సంవత్సరాలపాటు విద్యార్థులను పాఠాలను భోధించి.. రిటైర్ అయిపోయిన ఓ వ్యక్తి వాజ్ పేయి ఆ కాలేజ్ లో క్లాస్ మెట్ గా జాయిన అయ్యారు. ఆయన ఎవరో కాదు.. వాజ్ పేయి తండ్రి పండిట్ కృష్ణ బిహారీలాల్ వాజ్ పేయి. అప్పటికి ఆయన వయసు 50 కావడం గమనార్హం.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఆర్టికల్ లో రాసి తెలియజేశారు. వాజ్ పేయి ప్రధాని అయిన తర్వాత 2002-03 కాలంలో.. తను చదివిన కళాశాల మ్యాగ్జిన్ లో ఓ కవర్ స్టోరీ రాశారు. అందులో తండ్రి కొడుకులు ఒకే కాలేజీలో.. అందులోనూ ఒకే క్లాస్ లో చదువుకోవడం మీరు ఎక్కడా చూసి ఉండరు అంటూ వాజ్ పేయి పేర్కొన్నారు.

అంతేకాదు.. తన తండ్రి తరగతికి లేటుగా వస్తే.. మీ నాన్న కనిపించడంలేదేంటి అని తనను, తాను లేటుగా వస్తే.. తన తండ్రిని ప్రొఫెసర్లు ప్రశ్నించేవారని వాజ్ పేయి పేర్కొన్నారు. అందుకే ఆ తర్వాత వారిద్దరూ సెక్షన్లు మారినట్లు ఆయన తెలిపారు.

తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే కాలేజీలో చదవడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ‘‘ నేను అప్పటికే విక్టోరియా కాలేజీలో బీఏ పూర్తి చేశాను. ఆ సమయంలో నాన్ని ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు.. పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. వారికి పెళ్లిచేసి పంపడానికే డబ్బులు లేవు. అలాంటి సమయంలో నా భవిష్యత్తు ఏంటా అని భయపడ్డాను’‘.

‘‘ అయితే.. నా చదువు కోసం ఒకరు స్కాలర్ షిప్ పంపిస్తామని చెప్పడంతో నేను కాన్పూర్ కాలేజీలో చేరాను. ఇదే కాలేజీలో మా అన్నయ్య కూడా లా విద్య పూర్తి చేశాడు. అయితే అనూహ్యంగా నాన్న కూడా అదే కాలేజీలో లా విద్య చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన నిర్ణయం మా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.  అప్పటికే ఆయన వయసు 50 సంవత్సరాలు. జుట్టు తెల్లగా అయిపోయింది. నాతోపాటే ఆయన కూడా అదే కాలేజీలో చేరారు. ఈ విషయం కాలేజీలో, హస్టల్ లో తెలిసి.. మా ఇద్దరిని చూడటానికి స్టూడెంట్స్ అంతా అక్కడికి వచ్చేవారు’’ అని వాజ్ పేయి ఆ ఆర్టికల్ లో పేర్కొన్నారు. 

click me!