ఫ్లిప్ కార్ట్ చేసిన తప్పుకు ఎగిరి గంతేసిన కస్టమర్.. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే.. వచ్చింది చూసి.....

By SumaBala BukkaFirst Published Oct 7, 2022, 11:21 AM IST
Highlights

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఓ పెద్ద మిస్టేక్ చేసింది. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐ ఫోన్ 14ను పంపింది. దీంతో అది అందుకున్న కస్టమర్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. 

ఫ్లిప్ కార్ట్  పెద్ద తప్పు చేసింది.  పప్పులో కాలేసింది. ఈ కామర్స్ సంస్థ చేసిన పొరపాటుతో పండగ వేళ ఓ కస్టమర్ ను అదృష్టం వరించింది. ఐ ఫోన్ 13ను ఆర్డర్ పెట్టిన కస్టమర్.. ఫ్లిప్కార్ట్ చేసిన పనికి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు  విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఫ్లిప్ కార్ట్ ఎప్పుడూ తప్పులే కాదు..  ఒక్కోసారి  ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుందన్నమాట’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే…

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య  సెల్ ఫోన్లు, గృహోపకరణాలు, తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐఫోన్ లపై కూడా బంపర్ డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో చాలామంది ఐఫోన్ లవర్స్ ఆ ఫోన్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా సేల్స్ లో ఐఫోన్ 13 తక్కువ ధరకే రావడంతో కొనడానికి జనాలు పోటీ పడ్డారు. విపరీతంగా ఐఫోన్ 13 ఫోన్లను ఆర్డర్ చేశారు. ఇలా ఆర్డర్ పెట్టిన చాలా మందిని ఫ్లిప్ కార్ట్ మోసం చేసింది.

ఢిల్లీలో దారుణం.. బాలిక‌ను స్కూల్ వాష్‌రూమ్‌లో బంధించి గ్యాంగ్ రేప్.. ఘ‌ట‌న‌పై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్

రకరకాల కారణాలతో ఆర్డర్ లను క్యాన్సల్ చేసింది. కానీ,  ఓ వ్యక్తికి మాత్రం భారీ సర్ ప్రైజ్ వచ్చింది. ఐఫోన్ 13ను ఆర్డర్ పెడితే..  తాజాగా ఐఫోన్ 14ను డెలివరీ చేసింది. తాజాగా మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 14 కేవలం రూ.49 వేలకే కస్టమర్కు అందించింది. ఫ్లిప్ కార్ట్ నుంచి ఐఫోన్ మొబైల్ రావడంతో సదరు కస్టమర్ ఎగిరి గంతేశాడు. కాగా, ఈ విషయాన్ని అశ్విన్ హెగ్డే అనే టెక్ న్యూస్ యూట్యూబర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో  ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారింది. అశ్విన్ హెగ్డే పెట్టిన పోస్ట్ మీద నెటిజన్లు స్పందిస్తున్నారు.  ఐఫోన్ 13, ఐఫోన్ 14ల మధ్య  పెద్దగా తేడా ఏమీ లేదు.అందుకే ఐఫోన్ 13కు బదులు ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14న డెలివరీ చేసిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ

— Ashwin Hegde (@DigitalSphereT)
click me!