బిహార్‌లోని మోతిహరిలో ఓ విమానం ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
బిహార్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్లైఓవర్ కింద విమానం ఇరుక్కుపోయింది. ఆకాశంలో ఎగరాల్సిన విమానం.. ఫ్లైఓవర్ కిందకు ఎలా వచ్చిందబ్బా? అక్కడ ఎలా చిక్కుకుంది? అనే కదా మీ డౌటు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.. పదండి.
అది ఇప్పుడు వినియోగంలో లేని విమానం. దాని సేవలు ముగిసిపోయాయి. ఆ విమానం బాడీని వేలం వేశారు. ముంబయికి చెందిన ఓ స్క్రాప్ డీలర్ ఈ విమాన బాడీని దక్కించుకున్నాడు. దీంతో ఈ విమానాన్ని అసోంకు పెద్ద లారీపై తీసుకెళ్లుతున్నారు.
ఈ లారీ బిహార్‌లోని గోపాల్ గంజ్‌కు జాతీయ రహదారి 28పై చేరగా.. అక్కడ ఓ ఫ్లై ఓవర్ అడ్డు వచ్చింది. డ్రైవర్ వెనుకా ముందు ఆలోచించాడు. గోపాల్ గంజ్‌లోని ఆ ఫ్లై ఓవర్ కింది నుంచి ముజఫర్‌పూర్ వైపుగా ముందుకు సాగితేనే.. ఆ లారీ అసోంకు చేరగలదు. మరో మార్గం లేదు. దీంతో ముందుకే గేర్ వేశాడు. ఆ ఫ్లై ఓవర్ నుంచి మెల్లిగా లారీని పోనిచ్చాడు. సగానికి పైగా ఆ విమానం ఫ్యూస్‌లెజ్ బయటపడింది. కానీ, చివరి భాగం మాత్రం ఆ ఫ్లై ఓవర్ కిందే ఇరుక్కుపోయింది. ఆ లారీ డ్రైవర్ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. టెక్నికల్ అవకాశాలనూ చూశాడు. కానీ, ఆయనకు పరిష్కారం దొరకలేదు. అయితే.. ప్రయత్నం మాత్రం ఆపలేడు.
Also Read: Hyderabad: ఇకపై డ్రగ్ టెస్టులు కూడా.. టెస్టు కిట్‌లతో పోలీసులు.. ఈ కిట్‌లు ఎలా పని చేస్తాయి?
అది అసలే జాతీయ రహదారి. అందులోనూ రద్దీ ఎక్కువ. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య పెద్దదైంది. ఆ విచిత్ర ఘటన చూడటానికి స్థానికులు వచ్చారు. సెల్ఫీలు తీసుకున్నారు.
Air India A320 fuselage from Mumbai ends up stuck under a bridge in Motihari during transport. 🛬🚛 pic.twitter.com/pXPBIbEpcH
— BladudX (@BladudX)విమానం బాడీ ఫ్లై ఓవర్ కింద ఇరుక్కున్న విషయం తెలియగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. పిపారా కోతి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో మనోజ్ కుమార్ సింగ్ పరిష్కారంగా అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ లారీ అన్ని టైర్ల నుంచి గాలిని తొలగించాలని సొల్యూషన్‌కు వచ్చినట్టు వివరించారు.