Gadchiroli encounter: గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

Published : Nov 13, 2021, 01:34 PM IST
Gadchiroli encounter: గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని (Maharashtra) గడ్చిరోలి మరోసారి ఉలిక్కిపడింది. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలోని  దనోరా తాలుకాలోని గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు  

మహారాష్ట్రలోని (Maharashtra) గడ్చిరోలి మరోసారి ఉలిక్కిపడింది. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలోని  దనోరా తాలుకాలోని గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ (encounter) చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరిన్ని భద్రతా బలగాలను కూడా ఘటన స్థలానికి పంపిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్