
జలౌన్ : వివాహ వేడుకలో ఆనందంగా గడిపి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఇళ్లకు తిరుగపయనం అయ్యారు. ఇలా కేరింతల మధ్య సాగుతున్న పెళ్లి బృందం బస్సు ప్రయాణం రోడ్డు ప్రమాదంతో విషాదంగా మారింది. పెళ్ళి బృందంతో కూడిన బస్సు రోడ్డుప్రమాదానికి గురవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా పదిహేనుమంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ 40మంది నిన్న(శనివారం) ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. సాయంత్రం పెళ్లిన వచ్చిన బస్సులోనే స్వస్థలానికి తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలోనే జలౌన్ జిల్లా గోపాల్ పుర ప్రాంతంలో పెళ్ళిబృందంతో కూడిన బస్సును వేగంగా దూసుకొచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదురుగు అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read More మండపంలో వరుడు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన వధువు..
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను ముందుగా హాస్పిటల్ కు తరలించి ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంనుండి చిన్నిచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డ వారికి ప్రథమచికిత్స అందించి ఇళ్లకు పంపించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.