అమానవీయం.. సెల్ ఫోన్ దొంగిలించాడంటూ, బట్టలూడదీసి తలకిందులుగా వేలాడదీసి...

By SumaBala BukkaFirst Published Dec 24, 2021, 6:34 AM IST
Highlights

సెల్ ఫోన్ దొంగతనం చేశాడని ఆరోపణతో సాటి  మత్స్యకారుడిపై సహచరులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైల శ్రీను మంగళూరులో పని చేస్తున్నాడు. బుధవారం ఓ మత్స్యకారుడి సెల్ ఫోన్ కనిపించ కుండా పోయింది. దీంతో ఆ సెల్ ఫోన్ ను శ్రీనునే దొంగిలించాడని అనుమానించారు.దాని గురించి అతన్ని నిలదీశారు. తాను తీయలేదని చెప్పడంతో దాడికి దిగారు. 

మంగళూరు :  Karnatakaలోని మంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. అనుమానంతో Fishermen తోటి మత్స్యకారుడితో అత్యంత దారుణంగా వ్యవహరించారు. బట్టలూడదీసి, తలకిందులుగా వేలాడదీసి.. అత్యంత పాశవికంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన Video ఇప్పుడు వైరల్ గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే..  సెల్ ఫోన్ Theft చేశాడని ఆరోపణతో సాటి  మత్స్యకారుడిపై సహచరులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైల శ్రీను మంగళూరులో పని చేస్తున్నాడు. బుధవారం ఓ మత్స్యకారుడి Cell phone కనిపించ కుండా పోయింది. దీంతో ఆ సెల్ ఫోన్ ను శ్రీనునే దొంగిలించాడని అనుమానించారు.దాని గురించి అతన్ని నిలదీశారు. తాను తీయలేదని చెప్పడంతో దాడికి దిగారు. 

మిగిలిన వారు అతన్ని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. సెల్ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పమంటూ వేధించారు.  ఆ తర్వాత అతడిని తాడుతో కట్టేశారు. శ్రీనును కొట్టిన మత్స్యకారులు కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన  వారేనని సమాచారం. అయితే ఈ తతంగం మొత్తాన్ని ఎవరు వీడియో తీయడంతో అది వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు  మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమారం వెల్లడించారు.

నాకు ఫ్రీ ఫుడ్ ఇవ్వవా? రెస్టారెంట్ సిబ్బందిపై పోలీసు దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్

ఇలాంటి దారుణమైన ఘటనే, నవంబర్ లో West Bengal లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు ఓ వ్యక్తి  Bodyలోకి బలవంతంగా Air నింపుతూ మరణించేలా చేశారు. దారుణమైన ఈ ఘటన వివరాల్లోకి వెడితే...పశ్చిమ బంగాల్ లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 16న Night duty చేయడానికి Rahmat Ali మిల్లుకు వెళ్లాడు. రెహమత్ ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు. అది కాస్తా పశుత్వానికి దారి తీసింది. టీజింగ్ చేయడం, ర్యాగింగ్ చేయడంతో ఆగకుండా.. ఊహించడానికి కూడా వీలుకాని చర్యకు దిగారు. సరదా కోసం.. దారుణంగా ఎయిర్ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. 

అప్పటివరకు వారి చిత్రహింసలను తట్టుకున్ననిస్సహాయుడు అయిన రెహమత్ తనను వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడ్డా విడువకుండా వారు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనతో, వారి పాశవిక చర్యలతో రెహమత్ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తరువాత అతని Health పూర్తిగా క్షీణించడంతో హుగ్లీలోని governament hospitalకి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Air pump ఒత్తిడి వల్ల అతని శరీరంలోని Liver పూర్తిగా పాడైపోవడంతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యంగా ఉండి, కుటుంబానికి అండాదండగా ఉన్న రెహమత్ చనిపోవడానికి, అతని మీద ఇంత పాశవికంగా, అనైతికంగా ప్రవర్తించడానికి, చివరికి అతను చనిపోవడానికి కారణం.. అతనితో పాటు మిల్లులో పనిచేసే.. షాజదా ఖాన్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని రెహమాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాజాద్ జూట్ మిల్లును శుభ్రం చేసే ఎయిర్ పంప్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే రెహమత్ మృతికి బాధ్యత వహిస్తూ.. నష్టపరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటివరకు యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

click me!