దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలి విడత ఎన్నికల పోలింగ్

By Siva KodatiFirst Published Apr 11, 2019, 7:15 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 91 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 

దేశ వ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 91 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.

రాష్ట్రాల వారీగా స్థానాల విషయానికి వస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 8, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఉత్తరాఖండ్ లో 5, బీహార్ లో 4, ఒడిశాలో 4, వెస్ట్ బెంగాల్ లో 2, అరుణాచల్ ప్రదేశ్ లో 2, జమ్మూకాశ్మీర్ లో 2, ఛత్తీస్ గఢ్ లో 1, మణిపూర్  లో 1, మేఘాలయలో 2, మిజోరంలో 1, నాగాలాండ్ లో 1, సిక్కింలో 1, త్రిపురలో 1, అండమాన్ నికోబార్ లో 1, లక్షద్వీప్ లో ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

మొత్తం 14.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందు కోసం 1,70,664 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

click me!