జలియన్‌వాలాబాగ్ దురాగతానికి వందేళ్లు.. .బ్రిటన్ పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని క్షమాపణలు

By Arun Kumar PFirst Published Apr 10, 2019, 7:15 PM IST
Highlights

భారత స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత విషాద సంఘటన జలియన్‌వాలా బాగ్ ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరెసా మే విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ బలగాలు చేసిన ఈ దాడిలో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని...వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ దుర్ఘటన జరిగి ఈ నెల 13వ తేదీకి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బ్రిటన్ ప్రధాని పార్లమెంట్ లో దీని గురించి ప్రసగించారు. 

ఈ దుర్ఘటన గురించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు కార్భిన్ కూడా ప్రసంగించారు. ఇలా అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న తమ దేశం తరపున మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తమ పార్టీ విచారం వ్యక్తం చేస్తోందన్నారు. 

సరిగ్గా వందేళ్ల క్రితం అంటే 1919  ఏప్రిల్ 13 న పంజాబ్ లోని అమృత్ సర్ పట్టణంలో కొందరు స్వాతంత్య్ర సమరయోధులు జలియన్‌వాలా బాగ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ  సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 

అయితే తమ పాలననకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభ గురించి తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం దారుణానికి పాల్పడింది. ఈ మైదానానికున్న అన్ని దారుల్లో సాయుధులను మొహరించి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా దిగ్బంధించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో దాదాపు 400 మంది మృత్యువాతపడ్డట్లు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వమే ప్రకటించింది. కానీ అంతకంటే ఎక్కువమందే అంటే దాదాపు 1000 మందికి పైగా చనిపోయివుంటారని చరిత్ర చెబుతోంది. ఈ దాడిలో అధికంగా చిన్నారులు. మహిళలే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ మారణహోమం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత విషాద సంఘటన నిలిచింది. స్వాతంత్య్రం తర్వాత అనేక సందర్భాల్లో బ్రిటీష్ ప్రభుత్వాలు దీనిపై విచారం వ్యక్తం చేశాయి. 2013 లో కూడా భారత దేశంలో పర్యటించిన అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా జలియన్‌వాలా బాగ్ ఘటనను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అందుకు కారణమైన తన దేశం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. 

click me!