C-295 Transport Aircraft: భారత వైమానిక దళానికి చెందిన తొలి C-295 రవాణా విమానం బుధవారం వడోదరలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ పిఎస్ నేగి నడిపారు. బహ్రెయిన్ నుండి బయలుదేరిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున ల్యాండ్ చేయబడింది. ఆర్డర్‌లో ఉన్న 56 విమానాలలో ఇది తొలి జెట్
C-295 Transport Aircraft: భారతదేశం ఎవరినీ ఆటపట్టించదు, ఎవరైనా ఆటపట్టించినా వదలదు... ఇలాంటి పరిస్థితుల్లో శత్రువులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం భారత వైమానిక దళం బలం మరింత బలపడింది. భారత వైమానిక దళానికి చెందిన తొలి C-295 రవాణా విమానం బుధవారం వడోదరలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో దిగింది. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ పీఎస్ నేగి నడిపారు. ముందుగా విమానాన్ని బహ్రెయిన్‌లో ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి వడోదర చేరుకుంది.
సెప్టెంబర్ 25న ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో జరిగే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విమానాన్ని భారత వైమానిక దళంలోకి లాంఛనంగా ప్రవేశపెడతారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. మొత్తం 56 విమానాలు IAFలోకి ప్రవేశబెట్టానున్నారు. వాటిలో 40 టాటా-ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశంలో తయారు చేయబడుతున్నాయి. అంతకుముందు, భారత వైమానిక దళానికి చెందిన మొదటి C-295 రవాణా విమానం గత శనివారం అంటే సెప్టెంబర్ 16న స్పెయిన్ నుండి భారతదేశానికి బయలుదేరింది. ఈ విమానం మాల్టా, ఈజిప్ట్ , బహ్రెయిన్‌లలో ఆగుతూ వడోదర చేరుకుంది. ఈ విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 13న స్వీకరించారు.
సెప్టెంబర్ 2021లో ఒప్పందం
సెప్టెంబర్ 2021లో 56 C-295 సైనిక రవాణా విమానాల సరఫరా కోసం భారతదేశం ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం.. వడోదరలోని ఎయిర్‌బస్ భాగస్వామ్యంతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో 40 విమానాలను తయారు చేస్తారు. గతేడాది అక్టోబర్‌లో వడోదరలో 295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ కన్సార్టియం ద్వారా భారత్‌లో తయారు చేయనున్న తొలి సైనిక విమానం ఇదే.
భారతదేశం కోసం తయారు చేయబడిన మొదటి C295 విమానం మేలో సెవిల్లెలో తన తొలి విమానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సెవిల్లే ప్రొడక్షన్ ప్లాంట్‌లో రెండవ విమానం నిర్మాణం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది మేలో భారత వైమానిక దళానికి అప్పగించబడుతుంది. భారత వైమానిక దళానికి చెందిన ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సెవిల్లె ఫెసిలిటీలో విస్తృతమైన శిక్షణ పొందారు.
C295 విమానం ప్రత్యేకతలు