హృదయ విదారకం.. ప్లాస్టిక్ కవర్ లో కుమారుడి డెడ్ బాడీ పెట్టి.. 70 కి.మీ బైక్ పై తండ్రి ప్రయాణం

Published : Aug 30, 2023, 07:00 AM IST
హృదయ విదారకం.. ప్లాస్టిక్ కవర్ లో కుమారుడి డెడ్ బాడీ పెట్టి.. 70 కి.మీ బైక్ పై తండ్రి ప్రయాణం

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుమారుడి చెరువులో పడ్డాడని పీహెచ్ సీ కి తీసుకెళ్తే.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని, కానీ వాహనాన్ని ఇవ్వలేమని వారు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక తండ్రి కుమారుడి డెడ్ బాడీని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి బైక్ పైనే హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్ల ముందే చనిపోయాడు. ఓ వైపు ఆ బాధ మనసును కలిచివేస్తున్న సమయంలో.. డెడ్ బాడీకి కచ్చితంగా పోస్టుమార్టం నిర్వహించాలని పీహెచ్ సీ సిబ్బంది తేల్చిచెప్పారు. కానీ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు వాహనాన్ని సమకూర్చలేదు. దీంతో ఆ తండ్రి ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుకొని, ఓ ప్లాస్టిక్ కవర్ లో కొడుకు డెడ్ బాడీని పెట్టుకొని 70 కిలో మీటర్లు హాస్పిటల్ కు బైక్ పై తీసుకెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన ఛత్తీస్‌గఢ్‌ లో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. కోర్బా జిల్లా  వికాస్‌ఖండ్‌ మండలంలోని అడ్‌సేనా గ్రామానికి చెందిన రామ్‌యాదవ్‌ కు కొన్నేళ్ల కిందట స్థానిక గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహం అయ్యింది. ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు ప్రస్తుతం ఏడాదిన్నర వయస్సు ఉంది. రామ్ యాదవ్ దంపతులు తమ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

ఈ క్రమంలో మంగళవారం రామ్ యాదవ్ భార్య పొలానికి వెళ్లింది. తనతో పాటు కుమారుడిని కూడా వెంట తీసుకొని వెళ్లింది. ఆమె పొలంలో పని చేసుకుంటోంది. బాలుడు పొలంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు పొలానికి సమీపంలో ఉన్న ఓ చెరువులో పడిపోయాడు. కొంత సమయంలోనే నీటిలో మునిగి చనిపోయాడు. కొంత సమయం తరువాత గమనించిన స్థానికులు.. ఆ బాలుడిని నీటిలో నుంచి బయటకు తీశారు. కానీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

దీంతో తల్లిదండ్రులు హుటాహుటినా దగ్గరలో ఉన్న పీహెచ్ సీకి వైద్యం కోసం తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలుడు మరణించాడు. దీంతో కుమారుడి డెడ్ బాడీని ఇంటికి తీసుకువెళ్లేందుకు వారు ప్రయత్నించారు. కానీ సిబ్బంది దానికి ఒప్పుకోలేదు. జిల్లా హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టారు. కానీ దాని కోసం అంబులెన్స్ కూడా సమకూర్చలేదు. సొంతంగా వాహనం ఏర్పాట్లు చేసుకొని సూచించారు. 

దీంతో చేసేదేమీ లేక.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుకొని రామ్ యాదవ్ తన కుమారుడిని బైక్ పైనే జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం డెడ్ బాడీని ప్లాస్టిక్ కవర్ లో చుట్టారు. తన స్నేహితుడిని వెనకాల కూర్చొబెట్టుకొని బైక్ పైనే జిల్లా హాస్పిటల్ కు కుమారుడి మృతదేహాన్నితీసుకెళ్లాడు. ఈ  ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌