
Congress Office: దిల్లీ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ(ఐఏసీసీ) ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి రెండు అగ్నిమాపక యంత్రాలను పంపినట్లు చెప్పారు. అయితే మంటలు చిన్నవేనని.. కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి ఏఐసీసీ సిబ్బంది(Congress Office staff) వాటిని ఆర్పివేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎయిర్ కండీషనర్ కంప్రెషర్‌లో విద్యుత్ లోపం కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, ఘటనపై విచారణ జరుపుతామని మరో అధికారి తెలిపారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం..ప్రమాదం జరిగిన సమయంలో కాంగ్రెస్ కార్యాలయం (Congress Office) మూసివేయబడింది. సైట్‌లోని కేర్‌టేకర్, గార్డ్‌లు, పోలీసులు అగ్నిమాపక సేవలను అప్రమత్తం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి..మంటలను అదుపులోకి తెచ్చారు.