
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా.. జమ్మూలోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టు మృతి చెందినట్టు సమాచారం.
దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్ ప్రాంతంలోని హరిపోరా గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు అధికారులు తెలిపారు.
ఈ కార్డన్ సెర్చ్ లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, CRPF సంయుక్తంగా పాల్గొన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరుడు హతమయ్యారనీ, వారు ఏగ్రూప్‌నకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.
ఈ సందర్బంగా.. ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నేడు ఇది రెండో ఎన్‌కౌంటర్ అని, ఈరోజు తెల్లవారుజామున దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. అలాగే.. షోపియాన్‌లోని లారీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోన్నట్టు తెలిపారు. పోలీసులు, భద్రతా బలగాలు ఈ ఎన్ కౌంటర్ ల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలాఉంటే.. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 32 ఎన్‌కౌంటర్లు జరగగా.. 44 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా, 26 మంది ఉగ్రవాదులు, 160 మంది తీవ్రవాద సహచరులను కూడా అరెస్టు చేశారు.