ముంబై ఎల్‌ఐసీ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున్న ఎగిసిపడిన మంటలు..

Published : Feb 10, 2023, 01:12 AM IST
ముంబై ఎల్‌ఐసీ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున్న ఎగిసిపడిన మంటలు..

సారాంశం

ముంబైలోని ఎల్‌ఐసీ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏడాది వ్యవధిలో రెండోసారి ఎల్‌ఐసీ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తూ, అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ముంబైలోని గిర్‌గావ్‌ ఎల్‌ఐసీ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని రెండో అంతస్తులో గురువారం (ఫిబ్రవరి 9) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పలు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండంతస్తుల భవనంలో ఉదయం నిశ్చితార్థం జరిగింది. 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండంతస్తుల ఎల్‌ఐసీ కార్యాలయంలోని శాలరీ సేవింగ్స్ స్కీమ్ విభాగంలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

అంతకుముందు బుధవారం (ఫిబ్రవరి 8) ముంబైలోని బోరివలి వెస్ట్ ప్రాంతంలోని ఒక గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. అనంతరం మంటలను అదుపు చేశారు.

గతేడాది కూడా ఎల్‌ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

గతేడాది కూడా ముంబైలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 7 మే 2022న ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కార్యాలయ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ.. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?