రైలును ఆపిన చెత్త : ఏసీ కోచ్ లో మోగిన ఫైర్ అలారం.. అసలు విషయం తెలిసి షాక్ అయిన ప్రయాణికులు..

By SumaBala Bukka  |  First Published Nov 15, 2023, 12:41 PM IST

సిగ్నల్ నుంచి రైలు ముందుకు కదలగానే రైలు ఫైర్ అలారం మోగింది. ఏసీ కోచ్ లోనుంచి ఈ అలారం మోగుతున్నట్లు అర్థమై ప్రయాణికుల పై ప్రాణాలు పైనే పోయాయి.  
 


ఉత్తరప్రదేశ్ : నిప్పు లేకుండా పొగ వస్తుందా?.. ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన వింటే.. మీకూ ఇదే అనుమానం వస్తుంది. షాహిద్ ఎక్స్‌ప్రెస్‌లో నిప్పూ లేదు, పొగా లేదు.. కానీ ఫైర్ అలారం మోగింది. దీంతో ఆ సమయంలో ఆ భోగీలో ఉన్న ప్రయాణికులందరూ దడుచుకున్నారు. ఒక్కసారిగా వారి మదిలో ఇటీవలి ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు మెదిలాయి. పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఏసీ కోచ్ ఎం6లో అలారం మోగుతోందని గుర్తించారు. రైలు మంటల్లో చిక్కుకుందని నిర్థారించుకున్నారు.

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది కూడా గౌరీబజార్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆపారు. మొత్తం తనిఖీ చేశారు. ఎక్కడా పొగ కానీ, మంటలు కానీ, నిప్పురవ్వకానీ కనిపించలేదు. అనుమానంతో మళ్లీ మళ్లీ వెతికారు. కానీ ఏమీ లేదు. ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతయ్యింది. ప్రయాణికులూ ఈ విషయాన్ని నమ్మలేదు. సిబ్బంది సరిగా చెక్ చేశారో లేదోనని అనుమానించారు. చివరికి తేలిన విషయం వారిని నవ్వుకునేలా చేసింది. 

Latest Videos

undefined

ఫ్లిప్‌కార్ట్ ఆఫీస్ లో చోరీ : ఉద్యోగం నుంచి తొలగించాడని ప్రతీకారం.. బొమ్మ తుపాకీతో బెదిరించి రూ.21 లక్షలతో ...

ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని గౌరీబజార్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న షాహిద్ ఎక్స్‌ప్రెస్‌లోని ఫైర్ అలారం ఒక్కసారిగా మోగింది. ఏసీ కోచ్ ఎం6లో అలారం మోగుతోంది. ఒక్కసారిగా ఫైర్ అలారం శబ్దం వినిపించడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. నవంబర్ 13న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైలు అమృత్‌సర్‌ నుంచి జయనగర్‌కు వెళ్తోంది.

అలారం మోగిన దాదాపు 45 నిమిషాల తర్వాత రైలు డియోరియా స్టేషన్‌కు చేరుకుంది. ఇక్కడ రైలును ఆర్పీఎఫ్,GRP తనిఖీ చేశారు.  రైలులో ఎక్కడా మంటలు లేవని తేలింది. ఇది విని ప్రయాణీకుల ఊపిరి పీల్చుకున్నారు. కానీ షహీద్ ఎక్స్‌ప్రెస్ ఫైర్ అలారం ఎలా మోగింది? అనే ప్రశ్న వారి మదిలో తొలుస్తోంది. 

రైలు నంబర్ 14676 గౌరీబజార్ స్టేషన్‌కు చేరుకునే సమయానికి పట్టాలపై గూడ్స్ రైలు ఉంది. దీంతో షహీద్ ఎక్స్‌ప్రెస్ కు సిగ్నల్ ఇవ్వలేదు. షాహీద్ ఎక్స్‌ప్రెస్‌ను మెయిన్‌లైన్‌లోనే నిలిపివేశారు. ఆ తరువాత సిగ్నల్ నుంచి రైలు ముందుకు కదలగానే రైలు ఫైర్ అలారం మోగింది. ఇలా ఎందుకయిందటా అంటే.. గౌరీబజార్ రైల్వేస్టేషన్ సమీపంలో చెత్తను తగులబెడుతున్నారు. అందులో నుంచి పొగలు రావడంతో.. ఆ పొగలకు రైలులోని ఫైర్ అలారం యాక్టివేట్ అయింది.

గౌరీబజార్ రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. గౌరీబజార్ టౌన్ ప్రాంతంలోని రైల్వే లైన్ సమీపంలో చెత్తను పెద్ద ఎత్తున తగులబెట్టారు. విపరీతంగా మంటలు ఎగిసిపడ్డాయి. బాగా  పొగలు రావడంతో రైలులో అలారం మోగింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై స్టేషన్ సూపరింటెండెంట్ వారణాసి డివిజన్‌కు సమాచారం అందించారు. దాదాపు 17 నిమిషాల పాటు ఆగిపోయిన ట్రైన్ ఆ తరువాత జైపూర్ వైపు వెళ్లింది. 

click me!