
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లో సెక్టార్ 55లోని ఓ వైన్స్ షాపులో మంటలు ఎగసిపడ్డాయి. లిక్కర్ బాటిళ్లు పేలిపోయాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆ సమయంలో ఆ లిక్కర్ షాప్ మూసే ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అగ్నిమాపక సిబ్బంది అందించిన వివరాల ప్రకారం, గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలో సెక్టార్ 55 వద్ద వైన్స్ షాపులో మంటలు అంటుకున్నట్టు ఉదయం 6.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని వివరించారు. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు వెళ్లినట్టు సీనియర్ అధికారులు వివరించారు. సుమారు గంటన్నర తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ. 5 కోట్ల వరకు నష్టం చేకూరిందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. అగ్నికి లిక్కర్ బాటిళ్లు పేలడం వల్ల వారికి గాయాలు అయ్యాయని చెప్పారు.
Also Read: ఉత్తరప్రదేశ్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ క్లీన్ స్వీప్.. ఖాతా తెరవలేకపోయిన ప్రతిపక్షాలు..
అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు వైన్స్ షాప్ మూసే ఉండటం వల్ల అందులో సేల్స్ మ్యాన్ లేడని వివరించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా కోట్ల రూపాయాల నష్టం వాటిల్లిందని ఫైర్ ఫైటర్ జస్బీర్ తెలిపారు.