Rohit Sharma:రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అతని సతీమణి రితికా సజ్‌దేహ్ (Ritika Sajdeh) ఎమోషనలయ్యారు. సోషల్ మీడియా వేదికగా తొలిసారిగా స్పందించారు.
Rohit Sharma | ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పిస్తూ టీం ఫ్రాంచైసీ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. రో`హిట్`మ్యాన్‌ను తప్పించడంపై సోషల్ మీడియాలో ఆయన అభిమాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల్లో ముంబై ఇండియన్స్‌ను అన్ ఫాలో చేస్తున్నారు. రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్‌ను చూడలేమని పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ సారధిగా రోహిత్ శర్మను తప్పించిన ప్రకటన వచ్చాక ఆయన భార్య రితికా సజ్‌దేహ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. `2013 నుంచి 2023 వరకు పదేండ్ల పాటు పలు సవాళ్లకు స్పూర్తిగా నిలిచావు. రోహిత్ మీ మీద చాలా గౌరవం ఉంది` అని చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధోనీ-రోహిత్ ` ఫోటోను సీఎస్కే షేర్ చేసింది. ఈ పోటో కామెంట్స్ సెక్షన్‌లో రితికా ఎల్లో కలర్ హర్ట్ ఎమోజీ జత చేసింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. రితికా కామెంట్‌ను 60 వేలమందికిపైగా లైక్ చేశారు.
Rohit Sharma: ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ టీం ఫ్రాంచైసీ యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అయితే.. రోహిత్ ను తప్పించడంపై సోషల్ మీడియాలో ఆయన అభిమాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల్లో ముంబై ఇండియన్స్‌ను అన్ ఫాలో చేస్తున్నారు. రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను తప్పించిన తరువాత ఆయన భార్య రితికా సజ్‌దేహ్ చేసిన ఎమోషనల్ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఆమె సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో స్పందించారు. `2013 నుంచి 2023 వరకు 10 పాటు పలు సవాళ్లకు స్పూర్తిగా నిలిచావు. మీ (రోహిత్) మీద చాలా గౌరవం ఉంది` అని చెన్నై సూపర్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ధోనీ-రోహిత్ ` ఫోటోను సీఎస్కే పంచుకుంది. ఈ ఫోటో కామెంట్స్ సెక్షన్‌లో రితికా ఎల్లో కలర్ హర్ట్ ఎమోజీ జత చేయడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను వీడతారా ? లేక CSKతో వెళతారా ? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మదిలో తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి సిఎస్‌కె లేదా రోహిత్ శర్మ నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఏదిఏమైనప్పటికీ ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం పెద్ద సంచలనం సృష్టిస్తుంది.
ఐదుసార్లు ఛాంపియన్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. రోహిత్ తన కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్‌ను 5 సార్లు టైటిల్‌ని గెలిపించాడు. అతను ఐపీఎల్‌లో అలా చేసిన మొదటి కెప్టెన్‌గా కూడా నిలిచాడు, అయితే 36 ఏళ్ల వయస్సులో, ముంబై రోహిత్ శర్మ భవిష్యత్తును నిర్ణయించింది. అతనిని కెప్టెన్సీ నుండి తొలగించింది. 2021 ఐపీఎల్ తర్వాత హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌లో చేరాడు. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ అరంగేట్రం సీజన్‌లోనే గుజరాత్‌ను చాంపియన్‌గా మార్చాడు. దీని తర్వాత.. వరుసగా రెండో సీజన్‌లో, హార్దిక్ కెప్టెన్సీలో జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్‌ను కాపాడుకోలేకపోయింది.