అమానుషం.. రెండువేల కోసం మైనర్ తో బూట్లు నాకించారు..

Published : Mar 15, 2021, 09:14 AM ISTUpdated : Mar 15, 2021, 09:16 AM IST
అమానుషం.. రెండువేల కోసం మైనర్ తో బూట్లు నాకించారు..

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ మైనర్ తో అమానుషంగా ప్రవర్తించారు. రెండు వేల రూపాయల విషయంలో జరిగిన గొడవలో మైనర్ ను విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ తాగించారు. 

మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత బుధవారం జబల్ పూర్ జిల్లాకు చెందిన 17యేళ్ల మైనర్ కు అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో రెండువేల రూపాయల విషయంలో గొడవ జరిగింది. 

ఈ నేపథ్యంలో ఆ నలుగురు మైనర్ ను నయాగావ్‌ ఏరియాలోని పొలంలోకి తీసుకెళ్లారు. ఆ తరువాత విచక్షణా రహితంగా కొట్టి, బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ కూడా తాగించారు. 

కొడుకు ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆ మైనర్ తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో పోలీసులు  మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ ఘటన తరువాత గురువారం రోజు మైనర్‌ ఇంటికి వెళ్లాడు. కానీ తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. ఆ సంఘటన తరువాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 
 
PREV
click me!

Recommended Stories

సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్.. ఎలా తయారుచేస్తారు..? తాగితే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..!
Army: భారత అమ్ములపొదిలో మరో అద్భుతం.. రంగంలోకి డ్రోన్ క్యాచర్ సిస్టమ్. ఎలా పనిచేస్తుందంటే.?