
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ మతపరమైన కార్యక్రమంలో ప్రసాదం తిని మహిళలు, పిల్లలు సహా 300 మందికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. లోనార్ లోని సోమతానా గ్రామంలో వారం రోజుల పాటు జరిగే 'హరినమ్ సప్తాహ్' చివరి రోజైన మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఎక్కడా తగ్గని రైతులు.. ఢిల్లీ ముట్టడికి సిద్ధం.. మళ్లీ చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
సోమతానా, ఖాపర్ ఖేడ్ గ్రామాలకు చెందిన వీరంతా రాత్రి 10 గంటలకు ఆలయానికి వచ్చి ప్రసాదం తీసుకున్నారు. ప్రసాదం తిన్న తర్వాత కడుపునొప్పి, వికారం, వాంతులు అయ్యాయి. రోగులందరినీ స్థానికులు, ఆరోగ్య సిబ్బంది దగ్గరలోని బీబీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ బెడ్ల కొరత కారణంగా చాలా మంది రోజులు హాస్పిటల్ బయటే రోడ్డుపై చికిత్స అందించారు. చెట్లకు సెలైన్ లు కట్టి చికిత్స అందిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారింది.
సోమతానాలో ఆరో రోజు జరిగిన మతపరమైన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరి రోజు కాబట్టి 400 నుంచి 500 మంది భక్తులు హాజరయ్యారు. వారందరికీ ఆలయ నిర్వాహకులు ప్రసాదం పంపిణీ చేయగా.. అందులో చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యారు. అయితే రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, వారిలో చాలా మందిని బుధవారం డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ పాటిల్ తెలిపారు.
మేడారం జాతరలో భక్తుడికి గుండెపోటు.. కృతిమ శ్వాస అందించి కాపాడిన రెస్క్యూ సిబ్బంది..
మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తితే అంబులెన్స్, ఇతర అవసరమైన పరికరాలతో వైద్యుల బృందాన్ని రంగంలోకి దింపినట్లు తెలిపారు.ప్రసాదం నమూనాలను విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపామని, దీనిపై విచారణ చేపడతామని చెప్పారు.