
ముంబై : సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా వాహనంలో వేరొక మహిళను మిశ్రా భార్య గమనించింది. దీంతో భార్యను తన కారును ఢీకొట్టాడనే ఆరోపణలపై కమల్ కిషోర్ మిశ్రాపై కేసు నమోదు చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. సబర్బన్ అంధేరి (పశ్చిమ)లోని నివాస భవనం పార్కింగ్ ప్రాంతంలో అక్టోబర్ 19న జరిగిన ఈ ఘటనలో కమల్ మిశ్రా భార్య గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.
అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు, కమల్ మిశ్రా భార్య తన భర్త కోసం వెతుకుతున్న క్రమంలో పార్కింగ్ ప్లేస్ లో అతని కారులో మరో మహిళతో కలిసి అతను కనిపించాడు. దీంతో భర్తను నిలదీయడానికి ఆమె వెళ్లడంతో కమల్ మిశ్రా అక్కడి నుండి తప్పించుకోవడానికి కారును స్పీడ్ గా పోనిచ్చాడు. ఈ క్రమంలో అతని భార్యను కారుతో గుద్దాడు. దీంతో ఆమె కాళ్ళు, చేతి, తలపై గాయాలు అయ్యాయని ఫిర్యాదును ఉటంకిస్తూ అధికారి తెలిపారు.
కర్ణాటకలో మఠాధిపతి మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. హనీట్రాప్, బ్లాక్‌మెయిల్‌తోనే సూసైడ్..!
ఫిర్యాదు ఆధారంగా, కమల్ మిశ్రాపై అంబోలిలో 279 (రాష్ డ్రైవింగ్), 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యతో గాయపరచడం) సహా ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపాడు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు. హిందీలో ‘దేహతి డిస్కో’ చిత్రానికి కమల్ మిశ్రా నిర్మాత.