రోడ్డు ప్రమాదంలో చిత్రనిర్మాత మృతి.. ఫోన్, గోప్రో కెమెరాలు మాయం...

By SumaBala Bukka  |  First Published Nov 2, 2023, 12:08 PM IST

రక్తమోడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులు ఫోటోలు తీయడంలో నిమగ్నమయ్యారు చుట్టుపక్కలగుమిగూడిన వాళ్లు. ఇదంతా దగ్గర్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 


ఢిల్లీ : రోజురోజుకూ మానవత్వం కనుమరుగవుతోంది. మనిషి చనిపోతున్నాడని తెలిసినా.. చూస్తూ పట్టనట్టే వెళ్లిపోతున్నారు. వీలైతే ఆ వ్యక్తి దగ్గరున్న విలువైన వస్తువులను ఎత్తుకెడుతున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనే ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ టూవీలర్ ను మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మృతుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ పియూష్ పాల్ గా గుర్తించారు. అతను గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించాడని తెలిపారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..అక్టోబర్ 28వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం.. దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై చిత్రనిర్మాత మోటార్‌సైకిల్ పై వెడుతుండగా.. అతని వెనుక వస్తున్న మరొక బైక్ ఢీకొట్టింది. దీంతో, పీయూష్ మోటార్‌సైకిల్ పైనుంచి స్కిడ్ అయ్యాడు. కొన్ని మీటర్ల వరకు రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లడం కనిపిస్తుంది.

Latest Videos

undefined

https://telugu.asianetnews.com/national/punjab-six-killed-in-road-accident-in-sangrur-district-ksm-s3hew2

రక్తపు మడుగులో పడి ఉన్న చిత్ర నిర్మాతను గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాల్ గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పనిచేస్తున్నాడు. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఉంటున్నాడు. ఆ సమయంలో అటునుంచి వెడుతున్న బాటసారులు కానీ, వాహనదారులు కానీ వెంటనే స్పందిస్తే అతను బతికేవాడని పీయూష్ స్నేహితుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 

చాలాసేపటి వరకు అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఫోటోలు క్లిక్ చేయడానికి ప్రజలు అతని చుట్టూ గుమిగూడారని.. అలా 20 నిమిషాల పాటు రక్తమోడుతూ రోడ్డుపైనే ఉండిపోయాడని స్నేహితుడు ఆరోపించారు. పీయూష్ దగ్గర ప్రమాద సమయంలో ఉన్న మొబైల్ ఫోన్, గో-ప్రో కెమెరాలు దొంగిలించబడినట్లు చెప్పాడు.

"రాత్రి 10 గంటల వరకు అతని మొబైల్ ఫోన్ మోగింది. తరువాత అది స్విచ్ఛాప్ అయ్యింది. తన పని కోసం వీడియో రికార్డ్ చేయడానికి ఉపయోగించే గో-ప్రో కెమెరా కూడా లేదు. మేం ఎవరి నుండి ఎటువంటి పరిహారం ఆశించడం లేదు, మాకు న్యాయం మాత్రమే కావాలి" అని స్నేహితుడు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేసిన మరో బైక్‌పై మోటారు సైకిల్ రైడర్‌గా గుర్తించిన బంటిపై కేసు నమోదు చేశారు.

click me!