కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్ క్లాసులను రెండు వారాల పాటు నిలివేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు వివరాలు వెళ్లడించారు.
దేశంలో కరోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. పదిహేను రోజుల క్రితం వరకు పది వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యేవి. ఇయితే గత కొంత కాలంగా కేసులు లక్ష కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందటి నుంచి రెండు లక్షల కంటే ఎక్కువగానే కోవిడ్ -19 (covid-19) కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,68,833 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ -19 (covid - 19) కేసులతో పాటు దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) కూడా విజృంభిస్తోంది. ఇది దాదాపు అన్ని దేశాలకు వ్యాప్తిస్తోంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ ను 38 దేశాల్లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health organaigation) అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ కేసులు మన దేశంలో కూడా భారీగానే నమోదవుతున్నాయి. గతేడాది డిసెంబర్ (december) రెండో తేదీన భారత్ లో ఈ వేరియంట్ ను గుర్తించారు. కర్నాటకలోని (karnataka) బెంగళూరులో (bangloor) మొదటి రెండు కేసులను గుర్తించగా.. ఇప్పుడా కేసులు మూడు వేలను దాటాయి. అయితే ఇది స్వల్ప లక్షణాలను, స్వల్ప తీవ్రతను కలిగి ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ ధీర్షకాలికంగా ఈ వేరియంట్ ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళలో (kerala) ప్రభుత్వం రెండు వారాల పాటు ఆఫ్ లైన్ (offline) తరగతులను నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి (education minister v.shivan kutti) మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెళ్లడించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తరగతులను నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి పిల్లల భద్రత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనదని అన్నారు. అందుకే ఆన్ లైన్ ద్వారా క్లాసులు కొనసాగించాలని తెలిపారు. దాని కోసం టైం టేముల్ (time table) రూపొందిస్తామని అన్నారు. అయితే 10, 11, 12 తరగతుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. వారిని కరోనా (corona) నుంచి కాపాడేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి అన్నారు.
కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 35 లక్షల మంది విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ (online) తరగతులకు హాజరవుతారని విద్యా శాఖ మంత్రి తెలిపారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రకటించిన సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (sslc), హయ్యర్ సెకండరీ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా విద్యార్థులకు టీకాలు వేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వారికి స్కూళ్లలోనే ఆరోగ్య కార్యకర్తలతో వ్యాక్సిన్ (vaccine) వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.