fight over rasgullas: రసగుల్లాల కోసం పెండ్లి వేడుకలో కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో ఆరగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారనీ, కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
fight over shortage of rasgullas at wedding: పెండ్లి వేడుకలు అంటేనే బాజా భజంత్రీలు, బంధువుల సందడి, చిన్నారుల కోలాహలం, రచికరమైన వంటకాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఒక్కోసారి పెండ్లి వేడుకలో శుభకార్యం నిర్వహించే వారు ఊహించినదానికంటే ఎక్కువగా బంధువులు, ఇతరులు వేడుకకు రావడంతో ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మాటల యుద్ధాలు సైతం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, శుభకార్యం కావడంతో కొట్లాటలు, పంచాయతీలు వద్దని సర్ధుకుపోతారు. కానీ తాజాగా జరిగిన ఒక పెండ్లి వేడుకలో ఆహారం విషయంలో చితకొట్టుకున్నారు.
అది కూడా రసగుల్లాల కోసం కర్రలతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ కేసు వెలుగుచూసింది. అర్థరాత్రి ఓ వివాహ వేడుకలో కర్రలతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం రక్తసిక్త ఘర్షణగా మారింది. ఈ దాడిలో ఓ మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాదానికి గల కారణాలు తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అనంతరం క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
undefined
పెళ్లి విందు రక్తసిక్తంగా..
శంషాబాద్ పట్టణంలోని నయావాస్ రోడ్డులోని బ్రిజ్భాన్ కుష్వాహా ఇంట్లో వివాహ వేడుక జరిగింది. అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత వివాదంలో చిక్కుకున్న మరో వ్యక్తి మనోజ్ కుమారుడు గౌరీశంకర్ శర్మ మరో ముగ్గురితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. విందు సందర్భంగా రసగుల్లా తినడంపై వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు. మాటలతో మొదలైన వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే కర్రలతో దాడి చేసుకున్నారు.
ఆరుగురికి తీవ్ర గాయాలు..
ఈ ఘటనలో బ్రిజ్భన్ సింగ్ భార్య భగవాన్ దేవి, బ్రిజ్భన్ సింగ్ కుమారుడు యోగేష్ గాయపడ్డారు. మరోవైపు మనోజ్, కైలాష్ కుమారులు గౌరీ శంకర్ శర్మ, ధర్మేంద్ర కుమారుడు రమేష్ శర్మ, పవన్ కుమారుడు గౌరీ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ రక్తసిక్త ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రసగుల్లా విషయంలోనే వివాదం..
శంషాబాద్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. విందులో రసగుల్లా తినే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అలాగే, ఈ ఘర్షణ గురించి ఫిర్యాదు లేఖ అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.