20 రూపాయిల బిల్లు విషయంలో గొడవ.. పానీ పూరి విక్రేత హత్య.. మహారాష్ట్రలో ఘటన

Published : Jan 23, 2023, 01:14 PM IST
20 రూపాయిల బిల్లు విషయంలో గొడవ.. పానీ పూరి విక్రేత హత్య.. మహారాష్ట్రలో ఘటన

సారాంశం

20 రూపాయిల బాకీ కట్టాలని కోరినందుకు ఓ వ్యక్తి పానీ పూరి విక్రేతను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 20 రూపాయిల గొడవ ఓ పాని పూరీ విక్రేత హత్యకు దారి తీసింది. తనకు బాకీ ఉన్న ఇరవై రూపాయలు ఇవ్వాలని కోరడంతో ఓ వ్యక్తి పానీపూరీ విక్రేతను కత్తితో దాడి చేశాడు. ఈ అనూహ్య దాడిలో పానీపూరీ విక్రయిస్తున్న వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలను కంటే సాలరీ హైక్.. ఏడాదిపాటు సెలవులు.. మన దేశంలోనే ఎక్కడంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జరిపట్క పోలీస్ స్టేషన్ పరిధిలో జైరామ్ గుప్తా అనే వ్యక్తి పానీ పూరి విక్రయించేవాడు. అయితే ఇప్పుడు కత్తితో దాడి చేసిన నిందితుడు పానీ పూరి బండికి కూతవేటు దూరంలో పని చేసేవాడు. అతడు జైరామ్ గుప్తాకు 20 రూపాయిల బాకీ ఉన్నాడు. అయితే ఆదివారం అతడు మళ్లీ జైరామ్ దగ్గరకు పానీ పూరి తినేందుకు వచ్చాడు. దీంతో అతడు ‘‘ముందు గతంలో తిన్న ఇరవై రూపాయల అప్పు తీర్చు, ఆ తర్వాత పానీపూరీ తిను’’ అన్నాడు. దీంతో నిందితుడు ఆగ్రహంతో పానీ పూరి విక్రేత కడుపుపై ​​కత్తితో చాలాసార్లు పొడిచాడు.

కల్తీ మద్యం సేవించి ముగ్గురు మృతి.. మరో ఆరుగురికి అస్వస్థత.. బీహార్ లో ఘటన

దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన మరణించాడు. 
 

PREV
click me!

Recommended Stories

పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!