
చెన్నై: పుదుచ్చేరికి సమీపంలోని కొత్తకుప్పం గ్రామలో గురువారం నాడు విషాదం చోటు చేసుకొంది. బైక్‌పై రెండు బ్యాగుల్లో Crackery తీసుకెళ్తున్న తండ్రి, కొడుకు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు.
also ead:దీపావళి బాణసంచా ఎఫెక్ట్: తెలంగాలో 31 మందికి గాయాలు
పుదుచ్చేరిలోని Ariyankuppam పట్టణానికి చెందిన Kalainesan తన కొడుకుతో బాణసంచా కొనుగోలు చేసేందుకు బైక్ పై వెళ్లాడు. అంతకుముందు తన గ్రామానికి పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో ఉన్న భార్యతో మాట్లాడి ఆయన కొడుకును తీసుకొని బాణసంచా కొనుగోలు కోసం వెళ్లాడు.
కలైనేశన్ అతని ఏడేళ్ల కొడుకు ప్రదేష్ లు రెండు గన్నీ బ్యాగుల నిండా బాణసంచాను కొనుగోలు చేశారు. ఈ బాణసంచాను బైక్ పై తీసుకొని PUDUCHERRY వైపు వెళ్తున్నారు.విల్లుపురం జిల్లా కొత్తకుప్పం గ్రామానికి వీరు ప్రయాణీస్తున్న బైక్ చేరుకున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకొంది. బాణసంచా ఒక్కసారిగా పేలడంతో ద్విచక్ర వాహనంపై ఉన్నకలైనేశన్, ప్రదేష్ లు ఇద్దరు సజీవ దహనమయ్యారు.
ఈ పేలుడుతో అదే దారిలో ప్రయాణీస్తున్న మరో ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ మెడికల్, రీసెర్చ్ సెంటర్ లో చేర్చారు.ఈ ఘటన పుదుచ్చేరి-విల్లుపురం సరిహద్దులో చోటు చేసుకొంది. దీంతో రెండు ప్రాంతాల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విల్లుపురం సూపరింటెండ్ ఎన్. శ్రీనాథ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కలైనేశన్ కొనుగోలు చేసిన టపాకాయలపై విచారణ ప్రారంభించారు.
బైక్‌పై టపాకాయలు తీసుకెళ్తున్న సమయంలో పెట్రోల్ కారణంగానో లేదా ఇతరత్రా కారణాలతో పేలుడు సంబవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై దర్యాప్తును ప్రారంబించామని పోలీసులు తెలిపారు.దీపావళి సందర్భంగా సంతోషంగా టపాకాయలు కాల్చేందుకు గోనెసంచిలో తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఈ పేలుడు చోటు చేసుకొన్న సమయంలో ఆ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించారు. ఈ పేలుడు చూసిన ఓ యువకుడు పేలుడు జరిగిన చోటుకు పరిగెత్తిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించాయి. మరోవైపు ఈ పేలుడుకు ఈ రోడ్డుపై ఇదే వాహనం పక్కనే వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బాణసంచాపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. అయినా కూడా టపాకాయలు కాల్చడాన్ని ఎవరూ మానలేదు. రాష్ట్రాలు టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించి చేతులు దులుపుకొన్నాయి. నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తే వాయు కాలుష్యం పెరిగేది కాదు. అంతేకాదు బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా పలువురు గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోనే 31 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరు తన కన్ను కోల్పోవాల్సి వచ్చింది.
ఢిల్లీలో గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382గా నమోదైంది. దీపావళిని పురస్కరించుకొని టపాసులు పేల్చడం వల్ల గాలిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీలోని పలు చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 గా రికార్డైంది. పూసా రోడ్డు వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 505కి చేరిందని అధికారులు చెప్పారు.