లవ్ మ్యారేజ్ చేసుకుందని గర్భవతైన కూతురు గొంతుకోసిన తండ్రి.. !

Published : Jul 23, 2021, 11:09 AM IST
లవ్ మ్యారేజ్ చేసుకుందని గర్భవతైన కూతురు గొంతుకోసిన తండ్రి.. !

సారాంశం

జార్ఖండ్ లోని ధన్ బాద్ కు రాంప్రసాద్ కుమార్తె ఖుష్బూ కుమారి (20) తొమ్మిది నెలల క్రితం, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీకరించలేని తండ్రి ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా తమ ల్యాండ్ ను చూపిస్తాను రమ్మని కూతురిని నమ్మించాడు. 

జార్ఖండ్ లో కుల దురహంకార హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కన్నకూరినే హతమార్చిన అమానుష ఘటన మానవత్వాన్ని మంట గలిపింది. కుమార్తెను నమ్మించి గొంతు కోసి హత్య చేసిన ఘటన జార్ఖండ్ లోని ధన్ బాద్ లో చోటు చేసుకుంది. 

పోలీసుల సమాచారం ప్రకారం జార్ఖండ్ లోని ధన్ బాద్ కు రాంప్రసాద్ కుమార్తె ఖుష్బూ కుమారి (20) తొమ్మిది నెలల క్రితం, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీకరించలేని తండ్రి ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా తమ ల్యాండ్ ను చూపిస్తాను రమ్మని కూతురిని నమ్మించాడు. 

అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన ఖుష్భూ తండ్రితో పాటు తల్లి కూడా ఉండటంతో పూర్తిగా నమ్మి వారితో బయలు దేరింది. తండ్రి పన్నాగాన్ని పసిగట్టలేకపోయింది. యారియా టౌన్ షిప్ నుంచి గోవింద్ పూర్ నవతాండ్ వద్దకు ఆటోలో వ్యవసాయ క్షేత్రం చూపించడానికి తీసుకువచ్చాడు రాంప్రసాద్. అక్కడ అదను చూసి తన ప్లాన్ అమలు చేశాడు. 

తల్లిని చంపేసి.. శవం పక్కన ఆ కూతుళ్లు ఏం చేశారంటే..!

గర్భవతి అని కూడా చూడకుండా పదునైన ఆయుధంతో కూతురి గొంతు కోశాడు. తీవ్రరక్తస్రావంతో కొట్టు మిట్టాడుతున్న కుమార్తెను చూసి తల్లి పెద్దగా అరుస్తూ, సాయం కోసం ఏడుపు ప్రారంభించడంతో, అతను అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఖుష్ఫుని చూసి తల్లి మూర్ఛపోయింది. 

స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తల్లిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగిందని గోవింద్ పూర్ ఇన్స్ పెక్షర్ సురేంద్ర కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu