దోమలకోసం పొగబెడితే.. మహిళ చచ్చిపోయింది..

Published : Jul 23, 2021, 09:59 AM IST
దోమలకోసం పొగబెడితే.. మహిళ చచ్చిపోయింది..

సారాంశం

ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండడంతో బుధవారం రాత్రి ప్లేట్లో బొగ్గులు వేసి  పొగ పెట్టారు. దాంతోపాటు దోమలను పోగొట్టేందుకు ఓ నూనెను అందులో పోసి నట్లు తెలుస్తోంది.  దీంతో ఇల్లంతా పొగ వ్యాపించింది. ఆ సమయంలో ఏసీ వేసుకుని కుటుంబం అంతా నిద్రపోయారు. పొగ ధాటికి నలుగురు స్పృహ కోల్పోయారు.

చెన్నై : దోమలను తరిమేందుకు ఏసీ గదిలో పొగబెట్టడంతో ఊపిరాడక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నై పమ్మల్ తిరువళ్ళువర్ వీధికి చెందిన చొక్క లింగం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య పుష్ప లక్ష్మి (53) కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండడంతో బుధవారం రాత్రి ప్లేట్లో బొగ్గులు వేసి  పొగ పెట్టారు. దాంతోపాటు దోమలను పోగొట్టేందుకు ఓ నూనెను అందులో పోసి నట్లు తెలుస్తోంది.  దీంతో ఇల్లంతా పొగ వ్యాపించింది. ఆ సమయంలో ఏసీ వేసుకుని కుటుంబం అంతా నిద్రపోయారు. పొగ ధాటికి నలుగురు స్పృహ కోల్పోయారు.

గురువారం ఉదయం ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి.. తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే పుష్ప లక్ష్మి మృతి చెందింది. శంకర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని సృహ కోల్పోయిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India