కోవిడ్ 19 : కొత్తగా 35 వేల కరోనా కేసులు, 500 మరణాలు..

Published : Jul 23, 2021, 10:26 AM IST
కోవిడ్ 19 : కొత్తగా 35 వేల కరోనా కేసులు, 500 మరణాలు..

సారాంశం

తాజాగా 35 వేల కేసులు వెలుగు చూడగా... మరణాలు కూడా 500లోపే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.

ఢిల్లీ : కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కొత్త కేసులే ఎక్కువగా నమోదు అవుతుండగా.. తాజాగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఊరటనిస్తుంది. 

ఇంకా అంతకు ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. తాజాగా 35 వేల కేసులు వెలుగు చూడగా... మరణాలు కూడా 500లోపే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.

బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా 16.68 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 35,342 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12 కోట్లు దాటింది.

ఇక ఇదే సమయంలో 38,740 మంది కోలుకోగా... మొత్తం రికవరీల సంఖ్య 3,04,68,079కి చేరింది. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది.

24 గంటల వ్యవధిలో మరో 483 మంది వైరస్కు బలయ్యారు. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,19,470 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

 కొత్త కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షల పైనే ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,513 మంది వైరస్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరింది.

ఇక దేశంలో మొత్తం టీకాలు అందుకున్న వారి సంఖ్య 42 కోట్లు దాటింది. గురువారం 54.76 లక్షల మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 42,34,17,030 మందికి వ్యాక్సిన్ వేశారు. 
 

PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India