
20 ఏళ్లపాటు అల్లారుముద్దుగా పెరిగిన కూతురు ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెబితే దాదాపుగా ఏ తల్లిదండ్రులూ ఒప్పకోరు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే కూతురు ఇష్టం మేరకు తల్లిదండ్రులు నడుచుకుంటారు. అది కూడా ఆ వ్యక్తి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాకే నిర్ణయం తీసుకుంటారు. చాలా సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలను కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. దీంతో చాలా మంది ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ఆ ప్రేమ పెళ్లి జరకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సార్లు వాళ్లు సఫలమైతే.. మరి కొన్ని సార్లు విఫలమవుతారు. ఇంకా కొన్ని సార్లు ప్రేమికులు, వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరగాల్సి రావొచ్చు. కర్నాటకలో కూడా ఓ జంటకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 14 కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఉగాండాకు చెందిన మహిళ బ్యాగ్‌లో..
ఓ ఇద్దరు యువతీ, యువకులు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. కలిసి జీవితాంతం బతకాలనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయంలో కుటుంబ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆ యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని చెప్పారు. దీంతో ఆ యువతి ఓ నిర్ణయానికి వచ్చింది. తల్లిదండ్రులను ఎదురించి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడువగా ఓ గూడిలో ఆ ఇద్దరు ప్రేమికులు భార్యాభర్తలుగా మారారు. వేద మంత్రాల సాక్షిగా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తరువాత వారి గ్రామానికి వెళ్లారు. పెళ్లి చేసుకుని గ్రామానికి వచ్చిన వారిని అమ్మాయి తండ్రి చూశాడు. తనకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అని ప్రశ్నించి ఇద్దరిని అడ్డుకున్నాడు. అందరూ చూస్తుండగానే కోపంతో కూతరు మెడలోని తాళిని తెంచేశాడు. జుట్టు పట్టుకున్నాడు. గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. బలవంతంగా తండ్రిని వదిలించుకొని భర్త దక్కరకు చేరింది. ఈ ఘటన కర్నాకట రాష్ట్రంలో మంగళవారం కలకలం సృష్టించింది.
అసభ్యంగా ప్రవర్తించాడని.. సుపారీ ఇచ్చి యువకుడిని హత్య చేయించిన తోటి విద్యార్థినులు..
చైత్ర, మహేంద్రలు ప్రేమికులు. అమ్మాయిది నంజనగూడు ప్రాంతానికి చెందిన హరతళె. అబ్బాయిది పక్కనే హల్శెర గ్రామం. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ చైత్ర తండ్రి బవసరాజు నాయక్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 8వ తేదీన వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. సాయంత్రం నంజనగూడుకు వచ్చారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని వచ్చినందుకు అమ్మాయి తండ్రి వారిద్దరిని అడ్డుకొని గొడవ చేశాడు. భర్త పక్కన ఉండగానే మెడలో తాళి తెంపేసి జుట్టు పట్టుకున్నాడు. చైత్ర కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తండ్రిని అడ్డుకున్నారు. తండ్రి నుంచి బలవంతంగా విడిపించుకున్న చైత్ర తన భర్త మహేంద్రను చేరుకుంది. ఈ ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమను రక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగా కూతురు పట్ల తండ్రి ఇలా ప్రవర్తించడం అక్కడున్న వారిని విస్మయానికి గురి చేసింది.