ఇంట్లో వండిన చికెన్ కర్రీ మొత్తం తినేశాడని తండ్రితో గొడవ.. దాడిలో కొడుకు దుర్మరణం.. ఎక్కడంటే?

Published : Apr 06, 2023, 03:09 AM IST
ఇంట్లో వండిన చికెన్ కర్రీ మొత్తం తినేశాడని తండ్రితో గొడవ.. దాడిలో కొడుకు దుర్మరణం.. ఎక్కడంటే?

సారాంశం

కర్ణాటకలో చికెన్ కర్రీ కోసం తండ్రీ కొడుకులు కొట్టుకున్నారు. ఆగ్రహంలో తండ్రి చెక్క దుంగను తీసి కొడుకు తలపై వేశాడు. దీంతో కొడుకు తీవ్ర గాయాలకు లోనై మరణించాడు.  

బెంగళూరు: కర్ణాటకలో చికెన్ కర్రీ కోసం తండ్రీ కొడుకులు వాదులాడుకున్నారు. ఇంట్లో వండిన చికెన్‌ను తండ్రి మొత్తం తినేశాడని అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు అంతెత్తు ఎగురుతూ ఆగ్రహించాడు. తండ్రికి, కొడుక్కి మధ్య గొడవ ముదిరింది. తారాస్థాయికి వెళ్లింది. ఆగ్రహంతోనే తండ్రి ఓ చెక్క దుంగ తీసుకుని కొడుకు తలపై బలంగా వేశాడు. ఈ దెబ్బతో కొడుకు మరణించాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు.

సలియా తాలూక గుత్తిగార్ గ్రామం సలియా  తాలూకలో ఈ కొట్లాట మంగళవారం జరిగినట్టు వివరించారు. 

మృతుడిని శివరామ్‌గా పోలీసులు గుర్తించారు. తండ్రి షీనాతో గొడవ పడుతుండగా ఆయన కోపంలో ఓ చెక్క దుంగతో కొడుకు పై దాడి చేశాడు.

Also Read: సోషల్ మీడియాలో ఫాలోవర్లకు న్యూడ్ ఫొటోలు పంపి..ఆపై బ్లాక్‌మెయిల్.. ఇన్‌స్టా మోడల్ స్టోరీ ఇదే

శివరామ్ ఇంటిలో చికెన్ కర్రీ వండారు. బయటికి వెళ్లిన శివరామ్ ఇంటికి వచ్చేసరికి తాను కనీసం టేస్ట్ చేయడానికి కూడా లేకుండా కర్రీని ఖతం చేశారని ఆగ్రహించాడు. తండ్రితో ముందు వాగ్వాదంలా జరిగింది. ఆ తర్వా త సీరియస్‌గా పరిణ మించింది. అప్పుడే చెక్క దుంగను చేతిలోకి తీసుకుని తండ్రి షీనా అక్కడే ఉన్న కొడుకు పై దాడి చేశాడు.

ఈ విషయం తెలియగానే పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. నిందితు డిని అరెస్టు చేశారు.

మృతుడు శివరామ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?