ఎనిమిదేళ్ల కొడుకుపై తండ్రి పైశాచికత్వం.. హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. చివరికి..

Published : Nov 24, 2021, 04:56 PM IST
ఎనిమిదేళ్ల కొడుకుపై తండ్రి పైశాచికత్వం.. హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. చివరికి..

సారాంశం

రాజస్థాన్ లోని  ఛిత్తోర్ గఢ్ లో  ఈ ఘటన జరిగింది. ఛిత్తోర్ గఢ్ కు  చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వస్తూనే హోంవర్క్ రాసుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళాడు.  డ్యూటీ నుంచి వచ్చాక తండ్రి ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఒక తండ్రి తన ఎనిమిదేళ్ల కొడుకుతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తలకిందులుగా వేలాడదీసి చితగ్గొట్టాడు. ‘కిందకు దింపు.. కిందకు కుదింపు..’ అని ఆ చిన్నారి ఎంత వేడుకున్నా కనికరించలేదు. బూతులు తిడుతూ చంపేస్తానని thretan చేశాడు. home work చేయకుండా ఆడుకోవడానికి వెళ్లడమే ఆ బాలుడు చేసిన తప్పు.. ఆ మాత్రం దానికే ఆ తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు.

రాజస్థాన్ లోని  ఛిత్తోర్ గఢ్ లో  ఈ ఘటన జరిగింది. ఛిత్తోర్ గఢ్ కు  చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం school నుంచి వస్తూనే హోంవర్క్ రాసుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళాడు.  డ్యూటీ నుంచి వచ్చాక father ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు.

కొడుకుని పట్టుకొని తలకిందులుగా వేలాడదీశాడు. కర్రతో కొట్టాడు.  బాలుడు ఎంతగా ప్రాధేయ పడుతున్నా కనికరించలేదు.  బాలుడి తల్లి అడ్డుపడినా అతను ఆగలేదు.  దీంతో తట్టుకోలేకపోయిన ఆ mother  భర్త తన కొడుకును చిత్రహింసలు పెడుతున్న ఘటన వీడియో తీసింది. ఆ వీడియోను తన సోదరుడికి పంపించింది. అతను ఆ వీడియోను పోలీసులకు చూపించి తన బావపై  ఫిర్యాదు చేశాడు. Child Life Numberకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా, కర్ణాటకలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన కుమారుడు ప్రేమించిన మైనర్ బాలికపై బాలుడి తండ్రి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 13న చోటు చేసుకుంది. అత్యంత జుగుస్స కలిగించే ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. 

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీసులు బుధవారం తెలిపారు. అతనిపై POCSO act కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  స్టేషన్ పరిధిలో ఓ ఇద్దరు minorలు ప్రేమించుకున్నారు.  

తండ్రి మృతదేహాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే పెట్టుకుని.. అడిగితే త్వరలోనే కళ్ళు తెరుస్తాడని చెబుతూ...

ఈ క్రమంలో బుధవారం మైనర్ బాలిక.. తన మైనర్ ప్రియుడినిక కలిసేందుకు అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఇంట్లో లేదు. అతని తండ్రి, accussed ఇంట్లో ఉన్నాడు. బాలికకు కొడుకు ఇంట్లో లేడని చెప్పిన నిందితుడు.. ఆమె మీద కన్నేశాడు. ఈ క్రమంలో తన కొడుకు బయటకు వెళ్లాడని.. తిరిగి రావడానికి సమయం పడుతుందని.. ఆ వ్యక్తి బాలికకు చెప్పాడు.

కాసేపట్లో తిరిగి వస్తాడు కాబట్టి.. ఇంట్లోనే ఉండి కాసేపు ఎదురుచూడమని చెప్పాడు. తండ్రి వయసున్న అతని మాటలు నమ్మిన బాలిక,  సాయంత్రం కూడా కావడంతో ఇక అక్కడే ఉంది. ఇదే అదనుగా భావించిన నిందితుడు చంద్రు బాలికపై బలవంతంగా Sexual assaultకి పాల్పడ్డాడు.

ఈ ఘటనతో షాక్ అయిన బాధిత బాలిక.. ఆ తరువాత ఇంటికి పరుగెత్తుకెళ్లింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి నిందితుడిపై బాలెహోమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu