Free Ration: దేశంలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మరో నాలుగు నెలల పాటు ఫ్రీ రేషన్

By team teluguFirst Published Nov 24, 2021, 4:36 PM IST
Highlights

దేశంలోని 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) కింద ఉచితంగా రేషన్ కార్యక్రమాన్ని (free ration scheme) మరింత కాలం పొడిగించింది. 

దేశంలోని 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) కింద ఉచితంగా రేషన్ కార్యక్రమాన్ని మరింత కాలం పొడిగించింది. ఈ ఉచిత రేషన్ కార్యక్రమాన్ని (free ration scheme) వచ్చే ఏడాది మార్చి వరకు (2022 మార్చి) అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ వివరాలను వెల్లడించారు. ‘ 2022 మార్చి వరకు ఉచిత రేషన్ అందించడానికి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు’ అని అనురాగ్ ఠాగూర్ చెప్పారు. 

ఈ నిర్ణయం వల్ల ఖజానాపై అదనంగా రూ. 53,344 కోట్ల భారం పడుతుందని మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ పొడిగింపుతో కలిపి మొత్తం PMGKAY ఖర్చు దాదాపు రూ. 2.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ‘ గత 20 నెలలుగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా  పేద, మధ్యతరగతి కుటుంబాలు కష్టాలు పడటం చూశాం. అందుకే నిరుపేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడీలో పడుతున్నందున.. గణాంకాలు మెరుగ్గా కనిపిస్తున్నాయని మేము ఇప్పటికీ భావిస్తున్నాము. అదే సమయంలో కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కోరుకుంటున్నారు. అందుకోసమే రాబోయే నాలుగు నెలలు వారికి సహాయం చేసేందుకు ఆహార ధాన్యాలు ఇవ్వనున్నాం’ అని అనురాగ్ ఠాగూర్ తెలిపారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి పైగా ప్రజలకు నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందజేస్తున్నారు. గతేడాది కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2020 ఏప్రిల్‌లో ప్రారంభించారు. తొలుతు జూన్ వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టుగా చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ పథకాన్ని 2020 నవంబర్ వరకు పొడగించారు. 

Also read: Farm Laws Repeal Bill: మూడు సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఆ రోజున పార్లమెంట్‌లోకి..

ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది మే, జూన్‌ నెలలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత దానిని మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ గడువు ముగియనుంది. అయితే దీనిని మరోసారి నాలుగు నెలలు అంటే 2022 మార్చి వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉంటే.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రూపొందించిన బిల్లుకు (Farm Laws Repeal Bill, 2021) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (parliament winter session 2021) తొలి రోజే Farm Laws Repeal Bill- 2021 ను లోక్ సభలో ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తుంది. 

click me!