కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం.. క్రతువులు చేయాలంటూ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి..

Published : Jul 23, 2023, 05:01 PM IST
కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం.. క్రతువులు చేయాలంటూ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి..

సారాంశం

కర్ణాటకలోని ఓ కర్కశ తండ్రి కన్న బిడ్డనే చెరచాలని అనుకున్నాడు. కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. వెంటనే ఆమె ప్రతిఘటించి పారిపోయింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.  

బెంగళూరు: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి.. కన్న కూతురిపై కన్నేశాడు. 12 ఏళ్ల ప్రాయంలోనే అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రి.. ఆమెను కామంతో చూశాడు. కన్న కూతురిని మతపరమైన క్రతువులు చేయాల్సి ఉన్నదని మాయమాటలు చెప్పాడు. ఓ కొండ ప్రాంతానికి వెళ్లాలని బయల్దేరాడు. తండ్రి చెప్పాక మరో ఆలోచన ఏం ఉంటుందని బిడ్డ వెంటే ప్రయాణించింది. అక్కడికి వెళ్లాకే తండ్రి అసలు రాక్షసరూపం బయటపడింది.

కర్ణాటకలో దేవనాగరి జిల్లాలోని మాలెబెన్నూర్‌లో హరిహర్ తాలూకాలో తండ్రి తాను కన్న కూతురిని చెరచాలని అనుకున్నాడు. కొండ ప్రాంతాల్లో మతపరమైన క్రతువులు చేయాల్సి ఉన్నదని తీసుకుని వెళ్లాడు. కొండ పైకి తీసుకెళ్లాడు. ఎవరూ లేనిది చూసి బిడ్డపై అత్యాచారానికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న కూతురు ప్రతిఘటించింది. అక్కడి నుంచి తప్పించుకుని వేగంగా కొండ దిగేసింది. 

Also Read: యువతిని ర్యాపిడో బైక్ ఎక్కించుకుని దారి మధ్యలో డ్రైవర్ హస్తప్రయోగం.. యువతి ఏం చేసిందంటే?

ఆ బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood