
ముంబయి: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ కొడుకు తండ్రిని, సవతి తల్లిని ఘోరంగా చంపేశాడు. ఎవరికీ తెలియకుండా వారిద్దరి మృతదేహాలను బెడ్ బాక్స్‌లో దాచి పెట్టాడు. అనంతరం, ఇంటి నుంచి బయటకు చెక్కేశాడు. సోదరి వద్దకు వెళ్లాడు. ఆమెకు ఓ తప్పుడు స్టోరీని అల్లి వినిపించాడు. కానీ, అక్కడ నుంచి పరారయ్యాడు. ఎంతకీ సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె అనుమానం కలిగింది. తండ్రి, తల్లి కోసం ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గజానన్ నగర్ ఏరియాలో చోటుచేసుకుంది. తండ్రి, సవతి తల్లిని కొడుకు చంపేశాడు. ఈ హత్య చేస్తున్న సమయంలో దుండగుడు మద్యపానం మత్తులో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రిని, సవతి తల్లిని చంపేసిన తర్వాత వారి మృతదేహాలను వారు నిద్రించే బెడ్ బాక్సులో పెట్టేశాడు. అనంతరం అక్కడి నుంచి సోదరి ఇంటికి వచ్చాడు.
తన సోదరికి ఆ దుండుగు ఫేక్ స్టోరీ అల్లి నమ్మించే ప్రయత్నం చేశాడు. తండ్రి వేరే ఊరికి వెళ్లాడని, తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కథ అల్లాడు. ఆ తర్వాత ఆ దుండగుడు అక్కడి నుంచి కూడా పరారైపోయాడు. ఆ తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆ సోదరికి అనుమానం వచ్చింది. ఆమె నేరుగా ఇంటికి వెళ్లింది. ఇళ్లు డోర్ లాక్ చేసి ఉంది. ఆ డోర్‌ను బద్దలు చేసి లోపలికి ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. ఇందులో ఇరుగుపొరుగు వారూ సహకరించారు. కానీ, ఈ ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఇల్లు టెర్రస్ ఎక్కి కిటికీ గుండా ఇంటిలోకి వెళ్లింది.
లోపలికి వెళ్లగానే ఆమె ఖంగుతిన్నది. బెడ్‌పై భయంకరంగా నెత్తుటి మరకలు ఉన్నాయి. బెడ్ కింద బాక్సు ఓపెన్ చేస్తే.. అందులో ఇద్దరి డెబ్ బాడీలు రక్తపు మడుగులో కనిపించాయి. ఈ విషయం బయటకు తెలియగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పాట్‌కు వచ్చాు. ఆ రెండు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు.
కాగా, ఔరంగాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు కొంత సమాచారం సేకరించి నిందితుడు షిరిడీలో ఉన్నట్టు గుర్తించారు. వారు షిరిడీ వెళ్లి ఓ లాడ్జీలో నిందితుడిని పట్టుకున్నారు. అక్కడి నుంచి పుండ్లిక్ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే, ఈ హత్యల వెనుక గల కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉన్నది. పోలీసులు ఈ విషయంపైనా దర్యాప్తు చేయనున్నారు.