ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిపోయిన కారు.. నలుగురు మృతి

By team teluguFirst Published Dec 23, 2022, 2:30 PM IST
Highlights

ఛత్తీస్ గడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు శుక్రవారం తెల్లవారుజామున 50 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి చనిపోయారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా తమ బంధువు అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ కు వెళ్లారు. అక్కడి నుంచి తమ స్వస్థలమైన బెమెతర జిల్లాకు కారులో తిరిగి వస్తున్నారు.

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, పౌరులకు గాయాలు

ఈ క్రమంలో కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోల్మీ ఘాటి వద్దకు శుక్రవారం తెల్లవారుజామున చేరుకున్నారు. అయితే ఈ సమయంలో కారు అదుపుతప్పి 50 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. కారును బయటకు తీసుకొచ్చేందుకు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 

కారును బయటకు తీసినప్పటికీ అందులో ఉన్న ఫాగు యాదవ్ (60), సతీ బాయి (35), కౌశిల్య (70) అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మల్తీ (45) అనే మహిళ తీవ్రగాయాలతో బయటపడింది. అయితే ఆమెను చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నట్టు పోలీసు సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ చెప్పారు. 

బీజేపీ యూటర్న్.. జన్ ఆక్రోశ్ యాత్ర కొనసాగుతుంది: రాజస్తాన్ బీజేపీ స్పష్టీకరణ

ఇలాంటి ఘటనే జమ్మూకాశ్మీర్‌లో గత నెలలో చోటు చేసుకుంది. నవంబర్ 28వ తేదీన ఉదయం ఉధంపూర్ జిల్లాలో ఓ కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇందులో ఓ ముస్లిం మత నాయకుడు, ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యుల ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జామియా మసీదుసు చెందిన ఇమామ్ ముఫ్తీ అబ్దుల్ హమీద్ (32), తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి గూల్ సంగల్దాన్ నుండి ఉధంపూర్ వైపు వెళ్తోంది. ఉదయం 8.30 గంటల సమయంలో ఉధంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలోని ప్రేమ్ మందిర్ సమీపానికి చేరుకునే సరికి కారు అదుపుతప్పి 70 అడుగుల లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ముఫ్తీ అబ్దుల్ హమీద్ తో పాటు ఆయన తండ్రి ముఫ్తీ జమాల్ దిన్ (65) అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆయన తల్లి హజ్రా బేగం (60), మేనల్లుడు ఆదిల్ గుల్జార్ (16) తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని ఉదంపూర్ జిల్లాలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో వారు కూడా మరణించారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

పెళ్లి బట్టలు ధరించి కలెక్టర్ ఆఫీసుకు 50 మంది వరుళ్లు.. వధువులు కావాలని డిమాండ్

గత నెల 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో కూడా ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 32 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇదే రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీన చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

click me!