ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి, 26 మందికి గాయాలు

By Asianet News  |  First Published Oct 27, 2023, 5:25 PM IST

ఓ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మరణించారు. మరో 26 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో జరిగింది.


ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ సహా ఐదుగురు మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష.. ఏ కేసులో అంటే ?

Latest Videos

మీర్జాపూర్ కు చెందిన 35 మంది ఓ బస్సులో మాతవార్ కు వెళ్తున్నారు. అయితే ఆ బస్సు సంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలియా దాద్రి రోడ్డుపై ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ స్టీరింగ్ పై కంట్రోల్ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు మరణించారు.

Mirzapur Road Accident: उत्तर प्रदेश के मिर्जापुर थाना सन्तनगर क्षेत्रान्तर्गत ग्राम ददरी बन्धा के पास एक बड़ा हादसा हो गया। जहां एक बस अनियंत्रित होकर पलट गई। हादसा इतना भीषण था कि मौके पर ही 5 लोगों की मौत हो गई जबकि कई यात्री घायल हो गए। हादसे की सूचना पाकर पुलिस अधीक्षक… pic.twitter.com/qnILUJxRaD

— Punjab Kesari-UP/UK (@UPkesari)

మృతులను బదౌనా లాల్ గంజ్ కు చెందిన మమత (26), అభిషేక్ (2), మత్వార్ హాలియాకు చెందిన మనిత (25), బాబు గోదర్ దూబర్ లాల్ గంజ్ కు చెందిన విష్ణు (10), బస్సు డ్రైవర్ సత్యనారైన్ (40)గా గుర్తించారు. పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

డ్యూటీలో ఉన్న పోలీసునే ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి కింద పడి, తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్.. వీడియో వైరల్

కాగా.. క్షతగాత్రులను స్థానికులు హాలియా సీహెచ్ సీకి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) ప్రియాంక నిరంజన్ పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!