తమిళనాడులో మాండౌస్ తుఫాను బీభత్సం.. నలుగురు మృతి ; టాప్ పాయింట్స్

By Mahesh RajamoniFirst Published Dec 11, 2022, 6:09 AM IST
Highlights

Chennai: రానున్న కొద్ది గంటల్లో మాండౌస్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో శుక్రవారం రాత్రి 9:30 గంటలకు మండౌస్ తుఫాను తీరం దాటింది.
 

Cyclone Mandaus: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో మాండౌస్ తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను సంబంధిత ఘటనలో నలుగురు మృతి చెందగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. శనివారం సాయంత్రం ఉత్తర తమిళనాడులో మాండౌస్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడింది. మాండౌస్ తుఫాను రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడుతుందని ఐఎండీ అంత‌కుముందు పేర్కొంది. శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరాన్ని తాకిన మాండౌస్ తుఫానుకు సంబంధించిన టాప్ పాయింట్స్ ఇలా ఉన్నాయి.. 

 

Depression (remnant of the cyclonic storm “Mandous” pronounced as “Man-
Dous”) weakened into a Well Marked Low Pressure Area over north interior Tamil Nadu
and neighbourhood pic.twitter.com/nLFlADTP8r

— India Meteorological Department (@Indiametdept)
  • తమిళనాడు రాజధాని చెన్నైలో మాండౌస్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో కనీసం నలుగురు మరణించారు. 
  • తమిళనాడు స‌మీపంలోని పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య తీరం దాటుతుందని అంచనా వేయబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా రాయసలీమ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి.
  • ఆంధ్ర ప్రదేశ్ అంతటా మాండౌస్ తుఫాను ప్రభావం కనిపించింది.  
  • తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లాలో 20.5, చిత్తూరులో 22, ప్రకాశంలో 10.1, SPSR నెల్లూరు జిల్లాలో 23.4, తిరుపతి జిల్లాలో 2.4, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 13.2 మిల్లీ మీట‌ర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 వరకు సంబంధించిన గ‌ణాంకాలుగా పేర్కొంది. 
  • 708 మందిని అసురక్షిత లోతట్టు ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
  • అధికారిక ప్రకటన ప్రకారం 33 సహాయ శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. 778 మందికి పునరావాసం కల్పించారు. 1,469 ఆహార ప్యాకెట్లు, 2495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయబడ్డాయి.
  • నాలుగు జిల్లాల్లో 50 మందికి తక్కువ కాకుండా SDRF, 95 NDRF సిబ్బందిని మోహరించారు.
  • తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
  • నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

 

| Chittoor, Andhra Pradesh: Several areas in KVB Puram Mandal such as Kovanur, Thimmasamudram, Rajula Kandiga face overflow of rivers due to heavy rainfall in the region, roads submerged and traffic disrupted. pic.twitter.com/in5jHMB7Oc

— ANI (@ANI)

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాండౌస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 

 

MLA & MP-க்கள் - உள்ளாட்சிப் பிரதிநிதிகள், மேயர்கள் - துணை மேயர்கள், கவுன்சிலர்கள், மாநகராட்சி ஊழியர்கள், மின்சார வாரியம் - காவல்துறை - தீயணைப்புத் துறை ஊழியர்கள் - தூய்மைப் பணியாளர்கள் உள்ளிட்டோருக்கு என் பாராட்டுகளும் - நன்றியும்! (2/3) pic.twitter.com/6peryporOt

— M.K.Stalin (@mkstalin)
click me!