Farm laws: ఆ కేసులు ఎత్తివేయాల్సిందే.. మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతన్నలు

By Siva KodatiFirst Published Dec 5, 2021, 3:33 PM IST
Highlights

వివాదాస్పద రైతు చట్టాలను (farm laws) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రైతులు బోర్డర్‌ను ఖాళీ చేయక మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పారు.

వివాదాస్పద రైతు చట్టాలను (farm laws) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రైతులు బోర్డర్‌ను ఖాళీ చేయక మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పారు. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోకపోతే.. ఢిల్లీ (delhi border) సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లేది లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో (union govt) చర్చలకు రైతులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధరపై కేంద్రంతో ఈ బృందం చర్చలు జరపనుంది. రాకేశ్‌ టికాయత్‌తో (rakesh tikait) పాటు గుర్నామ్‌సింగ్‌, బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివకుమార్‌, యుద్‌వీర్‌సింగ్‌‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సాగుచట్టాల రద్దు రైతుల విజయమని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ టికాయత్ అన్నారు.

ALso Read:రైతు సంఘాల నేటి సమావేశంలో రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం !

కాగా.. రైతు స‌మ‌స్య‌లు, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ప్రారంభించిన ఉద్య‌మం ఇటీవ‌లే ఏడాదిని పూర్తిచేసుకుంది. రైత‌న్న‌ల అలుపెరుగ‌ని పోరాటంతో కేంద్రం వెన‌క్కి త‌గ్గింది. ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దానికి అనుగుణంగానే సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. రెండు స‌భల్లోనూ ఆమోదింప‌జేసింది. ఆ చ‌ట్టాలు ర‌ద్దుకు సంబంధించి రాష్ట్రప‌తి సైతం గెజిట్ నోటిఫికేష‌న్ విడుదల చేశారు. కానీ రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. 

ఇటీవ‌లే రైతు ఉద్య‌మం కొన‌సాగుతున్న నిర‌స‌న స్థ‌లి నుంచి రైతులు ఇండ్ల‌కు చేరే విధింగా ప్ర‌భుత్వం త‌మ‌పై ఒత్తిడి చేస్తున్న‌ద‌ని రైతు సంఘాలు పెర్కొన్న సంగ‌తి తెలిసిందే. అలాగే, వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు మాత్ర‌మే కాదు, పంట గిట్టుబాటు ధ‌ర‌, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత‌, ఉద్య‌మం నేప‌థ్యంలో చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించ‌డం స‌హా ప‌లు డిమాండ్ల‌తో ఉద్య‌మం కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే రైతు సంఘాలు దేశ‌రాజ‌ధాని స‌రిహ‌ద్దులోని నిర‌స‌న స్థ‌లివ‌ద్ద శ‌నివారం స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని గ‌త వారం పేర్కొన్నాయి.  

click me!