డిసెంబర్​ 8న భారత్​ బంద్​.. పిలుపునిచ్చిన రైతు సంఘాలు..

By AN TeluguFirst Published Dec 5, 2020, 11:25 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు డిసెంబర్​ 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఆందోళనలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు డిసెంబర్​ 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఆందోళనలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. 

దేశ రాజధాని ఢిల్లీకి దారితీసే రహదారులన్నింటినీ దిగ్బంధం చేస్తామని  అన్నదాతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం ఇప్పటికే నాలుగు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు.. రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఇవాళ్టి చర్చల్లో కేంద్రం.. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. రైతుల నిరసనతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ పిటిషన్​ దాఖలైంది. 

అంతేకాకుండా సరిహద్దుల్లో రైతులు బైఠాయించడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, దీని వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్‌ ఆరోపించారు. ఐతే రైతు ఉద్యమంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వేళ.. రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

click me!