ఢిల్లీ: రైతుల ర్యాలీకి అనుమతి... కండీషన్స్ అప్లయ్

By Siva KodatiFirst Published Jan 24, 2021, 7:40 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొద్దినెలలుగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రైతులు ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చారు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొద్దినెలలుగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డేని పురస్కరించుకుని రైతులు ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి అనుమతినిచ్చారు ఢిల్లీ పోలీసులు.

మూడు రూట్లలో మాత్రమే ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు. తమ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించాలని సూచించారు పోలీసులు.

శాంతియుత నిరసనల్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతుందన్న అనుమానం వ్యక్తం చేశాయి ఢిల్లీ నిఘా వర్గాలు. పాకిస్తాన్‌కు చెందిన దాదాపు 308 ట్విట్టర్‌ లింక్‌లను గుర్తించినట్లు తెలిపారు.

Also Read:రైతుల ఆందోళన: రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి

రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాతే ర్యాలీ నిర్వహించాలని పోలీసులు సూచించారు. రైతుల ర్యాలీకి భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. టిక్రీ, సింఘా, ఘాజీపూర్ బోర్డర్‌ల నుంచి ర్యాలీకి అనుమతించారు.

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి లభించడంతో తమ వాహనాలను సిద్ధం చేస్తున్నారు రైతులు. రెండున్నర నుంచి 3 లక్షల ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి.

శాంతియుత పద్ధతుల్లో తాము నిరసన తెలుపుతామని.. ఈ ర్యాలీలో పాల్గొనడానికి పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, వ్యక్తిగత వాహనాలపై ఢిల్లీకి బయల్దేరుతున్నారు. 

click me!