వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ.. రైతు మరణం..!

By telugu news teamFirst Published Jan 26, 2021, 4:13 PM IST
Highlights

సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి రైతు మరణించాడు. మరణించిన రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రైతులంతా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా... గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు ర్యాలీ చేపట్టారు. ట్రాక్టర్లతో రైతులు చేపట్టిన ఈ ర్యాలీ ఆందోళనకరంగా మారింది.

సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి రైతు మరణించాడు. మరణించిన రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. సదరు రైతు మరణానికి కారణం పోలీసు కాల్పులు జరపడమేనని నిరసన చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వారు చెప్పుకొస్తున్నారు.

మరో పక్క, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఎట్టేకేలకు ఎర్రకోటకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైతులు ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి ఫ్లాగ్ పోల్‌పై జెండాలు ఎగరేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేశారు. వారిని నిరోధించే క్రమంలో భాష్పవాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు.

click me!