ఎర్రకోటపై జెండా పాతిన అన్నదాతలు.. దించేసిన పోలీసులు

By Siva Kodati  |  First Published Jan 26, 2021, 3:34 PM IST

షరతులతో కూడిన ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతులు ఎందుకు ఇచ్చామా అన్నట్లుగా రైతులు ప్రవర్తిస్తున్నారు. గత 65 రోజులుగా పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా, ఎటువంటి హింసకు తావు లేకుండా చేసిన నిరసన దీక్ష ఈరోజు ఢిల్లీ మధ్యలోకి చేరింది. 

బారికేడ్ల తొలగింపు, ట్రాక్టర్‌లను పోలీసుల మీదకు ఎక్కించేందుకు రైతులు ప్రయత్నించారు. అలాగే ఎర్రకోటపై జాతీయ జెండా స్థానంలో సిక్కులు పవిత్రంగా భావించే జెండాను ఎగురవేశారు.

Latest Videos

ఈ నేపథ్యంలో ఎర్రకోటపై రైతుల్ని దించేశాయి రైతు  సంఘాలు. దాదాపు గంటసేపు ఎర్రకోటపైనే రైతులు ఆందోళన నిర్వహించారు. బలప్రయోగం లేకుండా రైతులను ఒప్పంచి కిందకు దించేశారు. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్లకుండా రైతుల్నీ పోలీసులు అడ్డుకుంటున్నారు. 

మరోవైపు ధర్నా సంద‌ర్భంగా కొంద‌రు నిహంగ్ ఆందోళ‌న‌కారులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఖ‌డ్గాల‌ను పోలీసుల‌పై ఎత్తడం జరిగింది. అయితే గాయపరిచేంతలా సంయమనం మాత్రం కోల్పోలేదని అంటున్నారు.

వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవజుతున్నాయి. ఢిల్లీ అక్ష‌ర్‌ధామ్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రగగా.. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా.. రైతు నిరసనలతో దేశ రాజధాని అట్టుడికపొతోంది.
 
click me!