Nitin Gadkari: "RSS హాస్పిటల్ హిందువులకు మాత్రమేనా?" గడ్కరీని ప్ర‌శ్నించిన‌ రతన్ టాటా

Published : Apr 15, 2022, 12:44 AM ISTUpdated : Apr 15, 2022, 01:09 AM IST
Nitin Gadkari: "RSS హాస్పిటల్ హిందువులకు మాత్రమేనా?" గడ్కరీని ప్ర‌శ్నించిన‌ రతన్ టాటా

సారాంశం

Nitin Gadkari: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు నితిన్ గడ్కరీ తెలిపిన‌ట్టు వివ‌రించారు.   

Nitin Gadkari: 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆసుపత్రి హిందువులకు మాత్రమేనా?' అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే మతం ఆధారంగా  ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను రతన్ టాటాతో తాను ఒకసారి చెప్పానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం అన్నారు. పూణెలోని సిన్హాగడ్ ప్రాంతంలో నితిన్ గడ్కరీ చారిటబుల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ.. గతంలో రతన్‌ టాటా, ఆయనకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు. శివసేన- బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కేబీ హెడ్గేవార్ ఆసుపత్రిని రతన్‌ టాటాతో కలిసి ప్రారంభించానని నితిన్‌ గడ్కరీ తెలిపారు. 

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి అన్ని వర్గాల కోసమని, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలాంటి వివక్షలు ఉండవని తాను చెప్పానన్నారు. ఆ సంద‌ర్భం టాటాను త‌న‌ని ఓ ప్ర‌శ్న అడిగిన‌ట్టు తెలిపారు. ఈ ఆసుపత్రి హిందూవుల కోస‌మేనా?  అని టాటా అడిగాడు.అయితే మీరు ఎందుకు అలా అనుకున్నారు అని తాను అడిగినట్లు నితిన్‌ గడ్కరీ చెప్పారు. అతను వెంటనే 'ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందినది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని రతన్‌ టాటా వెంటనే బదులిచ్చారని అన్నారు. అయితే.. ఆసుపత్రి అన్ని వర్గాలకు చెందినదని, ఆర్‌ఎస్‌ఎస్‌లో అలాంటిదేమీ (మతం ఆధారంగా వివక్ష) జరగదని తాను చెప్ప‌న‌ని కేంద్ర మంత్రి గ‌డ్కారీ అన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్‌ టాటా చాలా సంతోషించారని నితిన్‌ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

గురువారం పుణేలో అప్లా ఘర్‌ సేవా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో గడ్కరీ పై ఘటనను గుర్తు చేసుకున్నారు. అలాగే దేశం ఆదివాసీల దీనస్థితిపైనా సంఘీభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య, విద్యా రంగాల్లో వాళ్లకు అందుతున్న వసతుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

PREV
click me!

Recommended Stories

Earth 5 Major Risks : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu